పవన్ కళ్యాణ్ చేయలేనిది రామ్ చరణ్ చేస్తాడా..?
రామ్ చరణ్ తేజ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసేవారికి శుభవార్త. నిన్న మొన్నటి వరకు సంపత్ నంది సినిమా ముందు మొదలవుతుందా, వినాయక్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఎదురుచూశారు. అయితే హండ్రెడ్ పర్సెంట్ సంపత్ నంది సినిమాయే ముందు స్టార్ట్ అవుతోంది. 'మెరుపు" మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ లో అట్టహాసంగా ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే. ధరణిని పక్కన పెట్టి సంపత్ నందితో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఆల్ రెడీ 'రచ్చ" అనే టైటిల్ కన్ ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 25న ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు నిర్మాత ఆర్ బి చౌదరి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన సూపర్ గుడ్ సంస్థ ఇప్పుడు సూపర్ బ్యాడ్ పొజిషన్ లో వుంది. గతంలో స్టార్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ లతో వరుసగా సినిమాలు తీసిన ఈ సంస్థకి ఇప్పుడు హీరోనే దొరకట్లేదు. నాగార్జున, వెంకీ లతో ఉన్న రిలేషన్ ని చేజేతులా చెడగొట్టుకున్న వీరికి ఇప్పుడు తనీష్ ఒక్కడే దిక్కయ్యాడు. మినిమం ఇమేజ్ లేని ఈ కుర్రహీరోకి కోట్లు కోట్లు ఖర్చుపెడుతూ హిట్టిచ్చే భారం దేవుడి మీద వదిలేస్తున్నారు. తర్వాత ఎన్ వి ప్రసాద్ కి చిరంజీవితో ఉన్న రిలేషన్ వల్ల పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమా చేయగలిగారు. కానీ వారు ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇప్పుడు చరణ్ తో 'రచ్చ"చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమా అయినా వారికి పూర్వ వైభవం తెచ్చి పెడుతుందో లేదో వేచిచూడాల్సిందే...


Click it and Unblock the Notifications











