కలిసొచ్చింది: కరుణాకరణ్ కు ‘మెగా’ హీరో ఛాన్స్?

By Srikanya

హైదరాబాద్ : తొలి ప్రేమ తో పవన్ కళ్యాణ్ తో సూపర్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ ఆ తర్వాత ఎన్ని లవ్ స్టోరీలు చేసినా ఆ స్ధాయి సక్సెస్ ని అందుకోలేకపోయారు. ఈ మధ్యన ఫెయిల్యూర్స్ తో మరీ వెనకపడిపోయారు. అయితే ఆయన తాజా చిత్రం చిన్నదాన నీ కోసం ...విడుదలకు సిద్దమవుతున్న నేపధ్యంలో ఆడియోని, టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ ని చూసి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్ ఫోన్ చేసి విషెష్ చెప్పి, కథ చెప్పమన్నట్లు వినపడుతోంది. ఈ నేపధ్యంలో కరుణాకరన్ త్వరలో కథతో రామ్ చరణ్ ని కలవనున్నారని వినపడుతోంది. అదే నిజమైతే కరుణాకరన్ కు మళ్లీ టైమ్ మొదలయ్యినట్లే.

ఇక చిన్నదాన నీకోసం విషయానికి వస్తే...

నితిన్‌ హీరోగా నటించిన చిత్రం ‘చిన్నదాన నీ కోసం'. విక్రమ్‌గౌడ్‌ సమర్పిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎ.కరుణాకరన్‌ దర్శకుడు. మిస్తి నాయిక. అనూప్‌ సంగీతం వహించిన ఈ సినిమాలోని పాటలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.

నితిన్ మాట్లాడుతూ... ‘‘తొలిప్రేమను చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నా. కరుణాకరన్‌తో పనిచేయాలని అప్పటి నుంచే ఉండేది. ఈ సినిమా కంప్లీట్‌గా ఆయన స్టైల్‌లోనే ఉంటుంది. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ. నా పెర్ఫార్మెన్స్‌ వైవిఽధ్యంగా అనిపిస్తుంది. అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారు'' అని నితిన్‌ చెప్పారు.

ఈ సినిమాతో తమ సంస్థకు హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయమని నిఖితారెడ్డి అన్నారు. మంచి పాటలు కుదిరాయని, పిక్చరైజేషన్‌ కూడా చక్కగా ఉందని అనూప్‌ తెలిపారు. అందరికీ నచ్చే లవ్‌స్టోరీ అవుతుందని దర్శకుడు కరుణాకరన్‌ చెప్పారు.

Ram Charan chance for Karunakarn in the offing?

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ భామ మిస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇష్క్ చిత్రంలో ప్రజాదరణ పొందిన గీతంలోని చరణాన్ని టైటిల్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం కరుణాకరణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు.

శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X