'ఖైదీ' రీమేక్ విషయమై తేల్చిన రామ్ చరణ్
చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఖైదీ చిత్రం రామ్ చరణ్ రీమేక్ చేస్తారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అందుకోసం పరుచూరి బ్రదర్శ్ కూడా ఈ కాలానికి తగినట్లు దాన్ని మార్చి వినిపించారుట.అయితే చరణ్ మాత్రం నిక్కిచ్చిగా తాను ఇప్పట్లో రీమేక్ చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవని,కేవలం కొత్త కథలుతోనే ముందుకెళ్ళాలని, అందులో తన తండ్రి చేసిన పాటలో, ఫైట్సో ఇమిడేలా చూసుకోవాలని ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేసాట్ట. అందుకు తగినట్లు రచ్చ చిత్రంలో గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేయటం, మగధీర చిత్రంలో బంగారు కోడి పెట్ట పాటను పెట్టడం ఉదాహరణలుగా చూపించి ఖైదీని చేసేది లేదని మరో స్క్రిప్టుతో కలవమని చెప్పాడని ఫిల్మ్ నగర్ వార్త.


Click it and Unblock the Notifications











