శ్రీను వైట్లకు రామ్ చరణ్ కండీషన్స్ ?

By Srikanya

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో హిట్..ప్లాపులు సహజం అంటూంటారు కానీ ఒక హిట్ ఎంత పైకి తీసుకువెళ్తూంటే అదే స్ధాయిలో ఒక ఫ్లాపు కూడా అంతే క్రిందకు తీసుకువెల్తుంది. దూకుడు సినిమాతో వరస ఫ్లాపుల్లో ఉన్న మహేష్ కి హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల ఇప్పుడు అదే మహేష్ కు ఆగడుతో ఫ్లాపు ఇవ్వటంతో అన్ని చోట్లా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ ఎఫెక్టు ఆయన తదుపరి చిత్రంపై కూడా పడుతోంది. రామ్ చరణ్ తో చేయాలనుకున్న ప్రాజెక్టు పెడింగ్ లో పడటానికి ఆ పరాజయమే కారణమన్నది కాదనలేని సత్యం. అయితే... శ్రీను వైట్లతో చేయటానికి తనకు సమస్య లేదని, అయితే రచయితలుగా కోన వెంకట్, గోపీ మోహన్ లను పెట్టుకోవాలని కండీషన్ పెట్టినట్లు సమచారం.

కోన వెంకట్, గోపీ మోహన్ లతో కలిసి ఉన్నంత కాలం శ్రీను వైట్ల హిట్లు ఇస్తూనే వచ్చారు. అయితే ఆగడు చిత్రానికి వారు పనిచేయలేదు. శ్రీను వైట్ల మ్యాజిక్ సైతం తొలిసారిగా పనిచేయలేదు. దాంతో ఇదంతా గమనించిన రామ్ చరణ్ తన డేట్స్ కావాలంటే వారి కథ,మాటలుతో తన వద్దకు రావాలని చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పటికే రామ్ చరణ్ వద్ద గోపీ మోహన్ కథ ఒకటి ఓకే అయినట్లు సమాచారం.

Ram charan condition to Sreenu Vytla ?

ఈ నేపధ్యంలో శ్రీను వైట్ల కాంప్రమైజ్ అయ్యి... రామ్ చరణ్ తో ముందుకు వెళతారా లేక వేరే హీరోతో ఆయన చిత్రం చేస్తారా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వేరే వారిపై తన సినిమాలో సైటైర్స్ వేయకూడదని కూడా రామ్ చరణ్ కండీషన్ పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. తన సినిమాలో ఇండస్ట్రీలోని వ్యక్తులపై సెటైర్స్ వేయటం ద్వారా తన ఇమేజ్ కు ఇబ్బందని, కోరి తగువులు తెచ్చుకునే మనస్తత్వం కాదని అన్నట్లు వినపడుతోంది. ఇవన్నీ విన్న శ్రీను వైట్ల తన నిర్ణయం చెప్తానని వచ్చిసినట్లు చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X