»   » కొణిదెల స్టూడియోస్... చిరు 40 ఏళ్ల డ్రీమ్‌ రామ్ చరణ్ తీర్చబోతున్నారా?

కొణిదెల స్టూడియోస్... చిరు 40 ఏళ్ల డ్రీమ్‌ రామ్ చరణ్ తీర్చబోతున్నారా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Ram Charan Constructing Film Studio For Chiru

  మెగాస్టార్ చిరంజీవి... తన నలభై ఏళ్ల కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. నెం.1 స్థానాన్ని అందుకోవడంతో పాటు సంచలన విజయాలు నమోదు చేశారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని విస్తరించారు. కానీ చిరంజీవికి కొన్ని దశాబ్దాలుగా ఓ తీరని కోరిక అలాగే ఉండిపోయింది. అదే... మెగా ఫ్యామిలీకంటూ సొంతగా ఫిల్మ్ స్టూడియో లేక పోవడం. గతంలో ఎన్నో సందర్భాల్లో చిరంజీవి సొంత స్టూడియో కట్టాలని ప్లాన్ చేసినా వీలు పడలేదు. అయితే తండ్రి కోరికను తనయుడు రామ్ చరణ్ త్వరలో తీర్చబోతున్నారని, హైదరాబాద్‍‌లో కొణిదెల స్టూడియోస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

  రామ్ చరణ్ మెగా ప్లాన్

  రామ్ చరణ్ మెగా ప్లాన్

  ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్... తండ్రి కలను నిజం చేసే దిశగా మెగాప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. 25 ఎకరాల్లో సినీ స్టూడియో కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

  ఎక్కడ కట్టబోతున్నారు?

  ఎక్కడ కట్టబోతున్నారు?

  హైదరాబాద్ శివారులో రామ్ చరణ్ 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారని. ప్రస్తుతం తను నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి' షూటింగ్ అక్కడే జరుగుతోందని, ఇదే ప్రాంతంలో త్వరలో స్టూడియో వెలవబోతోందని చర్చించుకుంటున్నారు.

  త్వరలో భూమి పూజ

  త్వరలో భూమి పూజ

  ‘సైరా' షూటింగ్ పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కొణిదెల స్టూడియోస్ భూమిపూజ జరుగబోతోందని, 2022 నాటికి స్టూడియో సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం రామ్ చరణ్ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌చేస్తున్నట్లు టాక్.

   అత్యాధునిక హంగులతో...

  అత్యాధునిక హంగులతో...

  రామ్ చరణ్ నిర్మించబోయే ఈ సినీ స్టూడియో అత్యాధునిక హంగులతో.... అన్ని రకాల సినిమాల షూటింగులకు అనువుగా, త్వరగా మార్పులు చేర్పులు చేసుకునేలా నిర్మించబోతున్నారట. హాలీవుడ్ స్టైల్ స్టూడియోలా దీన్ని ప్లాన్ చేస్తున్నారట.

  మెగా అభిమానుల్లో ఆనందం

  మెగా అభిమానుల్లో ఆనందం


  ఇప్పటికే ఇండస్ట్రీలోని టాప్ ఫ్యామిలీస్ అందరికీ సొంతగా స్టూడియోలు ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీకి ఇది ఎప్పటి నుండో లోటుగానే ఉంది. ఆ లోటును పూడ్చేందుకు రామ్ చరణ్ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో అభిమానుల్లో సైతం ఆనందం వ్యక్తమవుతోంది.

  English summary
  Film Nagar Buzz is that, Ram Charan had purchased 25 acres on the outskirts of Hyderabad to construct Konidela studio. At present, the shooting of Sye Raa Narasimha Reddy is taking place in the same land. After completion of movie shooting, Chiranjeevi will perform Bhoomi puja for the land and studio will be ready by 2022.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more