Game Changer: రామ్ చరణ్ మూవీలో నందమూరి తారక రామారావు.. సైకిల్‌పై ఆ సీన్స్ సంచలనంగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. బడా బ్యాగ్రౌండ్‌తో వచ్చినా తనదైన చిత్రాలతో రేంజ్‌ను పెంచుకున్న అతడు.. ఇప్పుడు గ్లోబర్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నాడు.

వరుస హిట్లతో దూకుడు మీద ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 70 శాతం వరకూ మాత్రమే టాకీ పార్టును పూర్తి చేసేశారు.

Ram Charan Cycle Riding Scene Highlight in Game Changer Movie

బడా స్టార్ల కలయికలో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించారు. అలా పలు షెడ్యూళ్లను కూడా చేసుకుంటూ వచ్చారు. అంతలోనే మళ్లీ బ్రేక్ వేసేశారు. అయినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే దీన్ని మొదలు పెట్టి.. ఇక ఏమాత్రం బ్రేకులు లేకుండా జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది చివరి నాటికి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.

రాజకీయ నేపథ్యం ఉన్న స్టోరీలైన్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం లీకైంది. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్ తండ్రి పాత్రను కూడా చేస్తున్నాడని, అది సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Ram Charan Cycle Riding Scene Highlight in Game Changer Movie

తాజా సమాచారం ప్రకారం.. 'గేమ్ చేంజర్' మూవీలో తండ్రి పాత్రను పోషించే రామ్ చరణ్ అభ్యుదయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడట. ఆ సమయంలో అతడు సైకిల్ తొక్కుకుంటూ అసెంబ్లీకి వెళ్తాడని, ఆ సన్నివేశాలు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును గుర్తు చేసేలా ఉంటాయని అంటున్నారు. ఇదే నిజం అయితే ఈ చిత్రంలో ఈ ఎపిసోడ్ సంచలనం అవుతుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X