రామ్ చరణ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్?
హైదరాబాద్ : నిజంగా కుటుంబంలో విభేధాలు ఉన్నాయో లేవో గానీ ఫ్యాన్స్ మధ్యన మాత్రం తీవ్ర స్ధాయిలో విభేధాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య మాటల యుధ్ధం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ సాక్షిగా జరుగుతోంది. తాజాగా ఈ యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్త మరేదో కాదు రీమిక్స్ సంగతి.
'మిస్సమ్మ' సినిమాలోని 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..' పాటని 'ఖుషి'లో రీమిక్స్ చేశారు. ఇప్పుడు రామ్‌చరణ్ సినిమా 'గోవిందుడు అందరివాడేలే' కోసం మరోసారి ఇదే పాటను రీమిక్స్ చేయనున్నారని సమాచారం. రామ్‌చరణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రమిది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి స్వరకర్త. అయితే ఈ రీమిక్స్ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

పవన్ నీకు నచ్చడు కానీ ఆయన పాట కావాలా అంటూ ఫ్యాన్స్ ఒకరినొకరు సోషల్ మీడియాలో కామెంట్స్ ,పోస్ట్ అన్నట్లు సాగుతున్నారు. రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అగాధం తొలిగిస్తుందనుకుంటే ఇలా ఫ్యాన్స్ మధ్య అంతరం పెంచేదిగా ఉంది అని సినీ వర్గాలు అంటున్నాయి. ఏదైమైనా బాబాయ్, అబ్బాయ్ ఎప్పుడూ ఒకటే, ఈ రోజు ఇద్దరి మధ్యా భేధాభిప్రాయాలు ఉన్నా రేపు ఎలాగో కలుస్తారు. మధ్యలో వెళ్లి దెబ్బలాడుకునే వాళ్లే మిగిలిపోతారనేది వాస్తవం అంటున్నారు.
మరోప్రక్క తన పేరు ముందు ఉండే మెగా పవర్ స్టార్ అనే నిక్ నేమ్ ని వదిలించుకోవాలనిపిస్తోందిట. అప్పట్లో రామ్ చరణ్ లాంచ్ పఅయినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్న పవర్ స్టార్ కి, చిరంజీవికి ఉన్న మెగా స్టార్ కలిపి మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చేసింది మీడియా. ఇప్పుడు దాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ వదిలించుకోవాలని చిరంజీవి సైతం భావిస్తున్నారట. ఈ మేరకు ఆయన రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' లో ఆ పేరు వేయవద్దని, మెగాస్టార్ వేయమని చెప్పాడని ఫిల్మ్ నగర్ సమాచారం.
రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ 'గోవిందుడు అందరివాడేలే' . ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటం విశేషం. కాజల్ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది.


Click it and Unblock the Notifications











