రామ్ చరణ్ ఫిక్స్.. ఏప్రిల్ నెలలో!
మెగాస్టార్ చిరంజీవి సక్సెస్‌ఫుల్ జర్నీలో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. గత సినిమా 'సైరా నరసింహా రెడ్డి' జోష్ కంటిన్యూ చేస్తూ మెగా 152 సెట్స్ పైకి చేరారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. చిరంజీవి తప్ప ఇంకా మిగితా తారాగణం అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ రకరకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో చిరంజీవి సరసన త్రిష కన్ఫర్మ్ అయినట్లుగా, అదేవిధంగా రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు విన్నాం. అయితే అదే బాటలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమా కోసం 15 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట రామ్ చరణ్. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో చెర్రీ భాగం కానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల శివ రంగం సిద్ధం చేస్తున్నారట.

దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల రానుందని అంటున్నారు. అదేవిధంగా చిత్రంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్ కూడా కనిపిస్తుందని టాక్. సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు రూపొందించే సత్తా ఉన్న దర్శకుడు ఈ సినిమా కోసం కూడా బలమైన కథ రాసుకున్నారట.
అందుకే కాస్త లేటైనప్పటికీ ఓపికగా ఆ కథకు మరిన్ని మెరుగులు దిద్దారట. ఇక చిరంజీవి- కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం జనాలు చూస్తున్న ఎదురుచూపులను వర్ణించలేం!.


Click it and Unblock the Notifications











