twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ చిత్రంలో అమితాబ్

    By Srikanya
    |

    రామ్ చరణ్ త్వరలో హిందీలో తెరంగ్రేటం చెయ్యటానున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ చిత్రం ఖరారైందని హిందీ దర్శకుడు అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని ఓ హిందీ పత్రిక రాసుకొచ్చింది. అందులో రామ్ చరణ్ తో పాటు అమితాబ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కూడా నటించనున్నారని రాసింది. ఇక రానా ఇప్పుడు హిందీలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం తరహాలోనే ఈ సినిమా కూడా యాక్షన్ ధ్రిల్లర్ అని చెప్తున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం అని, ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం చర్చలు పూర్తయ్యయని, వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రారంభం కానుందని వ్యాఖ్యానించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రం చేస్తున్నారు. చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి మాట్లాడుతూ.... ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ ఉదాహణగా నిలిచిపోతుంది. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో ఎంత ఎక్కువ సినిమాటెక్ వ్యాల్యూస్ తో తీయవచ్చు అనే విషయంలో. మేము ఈ సినిమా పూర్తికాగానే ఎంత ఖర్చు అయ్యింది.. ఎలా ఖర్చు పెట్టాం అనే విషయాలను తెలియచేస్తాం అన్నారు రామ్ చరణ్.

    ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ.. నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను.. అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    Bollywood director Apurva Lakhia has signed Sanjay Dutt, Amitabh Bachchan and Abhishek Bachchan along with Ram Charan for a big budget Bollywood flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X