రామ్ చరణ్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. RRRకి బ్రేక్ ఇవ్వక తప్పేలా లేదు!

Recommended Video

Ram Charan Decided To Take A Break For RRR Shoot!! | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు నిర్మాతగా రాణిస్తున్నారు. తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీకి అన్నీ తానై ముందుకు తీసుకెళుతున్నారు. హీరో అంటే సెట్స్ పై బిజీగా ఉండి సినిమాలో నటించడంతో సరిపోతుంది.. కానీ ఓ నిర్మాతగా అంటే షూటింగ్ మొదలుకొని ప్రమోషన్స్ వరకూ అన్నీ దగ్గరుండి చూసుకొని సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తాజాగా ఈ విషయమై రామ్ చరణ్‌పై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. ఆ వివరాలు చూస్తే..

రామ్ చరణ్ పై పెరుగుతున్న ఒత్తిడి

రామ్ చరణ్ పై పెరుగుతున్న ఒత్తిడి

ఎంత భారీ స్థాయిలో సినిమాను రూపొందించినా విడుదలకు ముందు చేసే ప్రమోషన్సే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. సరిగ్గా ప్రమోషన్స్ చేస్తేనే బిజినెస్ సరిగ్గా అవుతుంది. పెద్ద సినిమాలకైతే ఇది మరీ ముఖ్యం. అందుకే 'సైరా నరసింహా రెడ్డి' డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోషన్స్ విషయంలో రామ్ చరణ్‌పై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.

సైరా నరసింహా రెడ్డి భారీ బిజినెస్

సైరా నరసింహా రెడ్డి భారీ బిజినెస్

చిరంజీవి, రామ్ చరణ్ ఐదారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' హక్కులు చేజిక్కించుకోవడంలో పోటీ పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. అన్ని ఏరియాల్లో కూడా చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని తెలిసింది. యూవీ క్రియేషన్స్ లాంటి భారీ సంస్థలు కూడా సైరా నరసింహా రెడ్డి హక్కుల కోసం ముందుకు రావడం విశేషం.

 డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్.. రామ్ చరణ్ హామీ

డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్.. రామ్ చరణ్ హామీ

భారీ మొత్తం చెల్లించి సైరా హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు.. ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని చెర్రీని కోరుతున్నారట. బాగా ప్రమోట్ చేసి భారీ క్రేజ్ తెచ్చి ఓ రేంజిలో ఓపినింగ్స్ తీసుకువచ్చేందుకు రామ్ చరణ్ ఎఫర్ట్ పెట్టాల్సిందేనని పట్టు బడుతున్నారట బయ్యర్లు. దీంతో స్వయంగా తానే రంగంలోకి దిగి సైరా ప్రమోషన్స్ చూసుకుంటానని హామీ ఇచ్చారట రామ్ చరణ్. ఈ మేరకు మరోసారి RRR కి కాస్త బ్రేక్ ఇవ్వక తప్పదట.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుండగా తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2 న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X