»   » రామ్ చరణ్ కావాలనే బన్నీ స్పీచ్ అవాయిడ్ చేసాడా?

రామ్ చరణ్ కావాలనే బన్నీ స్పీచ్ అవాయిడ్ చేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజులుగా రగులుతున్న పవన్ ఫ్యాన్స్ 'చెప్పను బ్రదర్' వివాదంపై అల్లు అర్జున్ బుధవారం జరిగిన 'ఒక మనసు' ఆడియో వేడుకలో తగిన సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. మొహమాటానికి పోకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్(సినిమా ఫంక్షన్లలో గొడవలు చేస్తున్న గ్రూఫు)కు 'సరైనోడు' సరైన సమాధానమే ఇచ్చాడని ఇండస్ట్రీ టాక్.

కాగా....'ఒక మనసు' ఆడియో వేడుకలో జరిగిన పరిణామాలు గమనిస్తే సినిమాటిక్ గా జరిగినట్లు స్పష్టమవుతోంది. 'ఒక మనసు' ఆడియో వేడుకలోనే తాడో పేడో తేల్చుకోవాలని బన్నీ ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమయింది. ఈ విషయమై మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి ముందే చర్చించినట్లు తెలుస్తోంది. ఆడియో వేడుకలో కొన్ని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

Ram Charan deliberately avoided Bunny speech

ఆడియో వేడుకకు ముందుగా నాగబాబు, నిహారిక, వరుణ్ హాజరయ్యారు. వరుణ్ ఆడియో వేడుకలో ఎంటరైనప్పటి నుండి ఏదో జరుగబోతున్నట్లు మొహం అదోలా పెట్టుకుని కూర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం కొంత సేపటికి బన్నీ, బన్నీతో పాటు సాయి ధరమ్ తేజ్ ఎంటరయ్యాడు. బన్నీ ముందుగా అనుకున్నట్లుగా స్టేజీ ఎక్కి తాను చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్లి పోయాడు. బన్నీ స్పీచ్ ఇస్తుంటే నాగబాబు బాగానే ఎంజాయ్ చేసాడు. కానీ వరున్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రం మొహం అదోలా పెట్టుకుని కూర్చోవడం గమనించవచ్చు.

బన్నీ తన స్పీచ్ ఇచ్చి వెళ్లి పోయాక రామ్ చరణ్ ఎంటరయ్యాడు. జరుగబోతోంది ముందే తెలుసు కాబట్టి రామ్ చరణ్ కావాలనే బన్నీ స్పీచ్ అవాయిడ్ చేసి తర్వాత వచ్చినట్లు స్పష్టమవుతోంది. రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లకు పవన్ కళ్యాణ్ తో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. అందుకే ఈ ముగ్గురు బన్నీ స్పీచ్ ఇస్తుంటే మూతి అదోలా పెట్టడం, అవాయిడ్ చేయడం లాంటివి చేసారని స్పష్టమవుతోంది.

మరో వైపు త్వరలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ చాలా డీలాగా ఉన్నాడు. కెరీర్ అనుకున్నట్లుగా సాగడం లేదు. ఈ మధ్య కాలంలో చెర్రీకి చెప్పుకోదగ్గ ఒక్క హిట్టు కూడా లేదు. అందుకే అనవసర గొడవల్లో తలదూర్చకూడదనే ఉద్దశ్యంతోనే అటు బన్నీ సైడ్ కానీ ఇటు పవన్ సైడ్ కానీ తీసుకోకుండా సైలెంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

English summary
Ram Charan deliberately avoided Bunny speech. Allu Arjun delivered his speech on the stage, while Nagababu, Sai Dharam Tej and Varun Tej stayed on. Although Nagababu was spotted enjoying Bunny's speech, both Varun and Sai Dharam Tej looked uneasy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu