Game Changer: ఆ హీరోకు శంకర్ ప్రాధాన్యత.. చరణ్ అసంతృప్తికి కారణం ఇదేనా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా.. అతి తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగి.. ఇప్పుడు గ్లోబర్ స్టార్ అనిపించుకుంటోన్నాడు మెగా కుర్రాడు రామ్ చరణ్. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన అతడు.. ఈ మధ్య కాలంలో విభిన్నమైన సినిమాలతో సత్తా చాటుతోన్నాడు. తద్వారా విజయాలను కూడా అందుకుంటోన్నాడు. దీనికితోడు RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో చరణ్ అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోన్నాడు.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైనా.. కొన్ని బ్రేకులతో సాగుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా పూర్తైనట్లు తెలిసింది. దీంతో మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో బాగా వైరల్ అవుతోంది.

Ram Charan Discontent on Director Shankar Decision

రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీనికి కారణం దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2' సినిమాను కూడా తెరకెక్కిస్తుండడమే అని చెప్పాలి. కమల్ హీరోగా రూపొందుతోన్న ఈ మూవీ ఎప్పుడో మొదలైనా.. అనుకోని కారణాలతో ఆలస్యం అయింది. దీంతో ఇప్పుడు దీన్ని శంకర్ త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం చరణ్ చిత్రానికి బ్రేకులు ఇస్తున్నాడు. దీనిపై ఈ మెగా హీరో అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతోంది.

భారీ బడ్జెట్‌తో వస్తున్న 'గేమ్ చేంజర్' చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X