RC15: మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. చరణ్ సినిమాలో అసలు ట్విస్ట్ అదేనట

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇంత కాలం టాలీవుడ్‌లోనే సత్తా చాటిన చాలా మంది స్టార్లు ఇప్పుడు తమ స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి భారీ చిత్రాలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బడా ప్రాజెక్టులో భాగం అయ్యాడు. ఇప్పటికే RRR అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తోన్న అతడు.. ఇప్పుడు దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

రెండూ భారీ చిత్రాలే చేసిన చరణ్

రెండూ భారీ చిత్రాలే చేసిన చరణ్

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ నక్సలైట్ పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే.

దిగ్గజ దర్శకుడితో సినిమాకు రెడీ

దిగ్గజ దర్శకుడితో సినిమాకు రెడీ

రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ రేంజ్‌లో తెరకెక్కనుంది.

అది ఆగడంతో దీని మీదే ఫోకస్‌గా

అది ఆగడంతో దీని మీదే ఫోకస్‌గా

ఎస్ శంకర్‌.. కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' అనే ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాపై పూర్తిగా ఫోకస్ చేశారని తెలుస్తోంది.

అవన్నీ కంప్లీట్.. వాళ్లను తీసుకుని

అవన్నీ కంప్లీట్.. వాళ్లను తీసుకుని

రామ్ చరణ్‌తో చేసే సినిమా కోసం శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టి.. దాదాపుగా వాటిని పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఈ మూవీ కాస్టింగ్‌ మీద దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ఎంపిక చేశారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని ఎంపిక చేశారు.

గ్రాండ్‌గా మొదలు.. జాతీయ స్థాయి

గ్రాండ్‌గా మొదలు.. జాతీయ స్థాయి

శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 8న అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. దీంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందనే చెప్పాలి.

డబుల్ ధమాకా ఖాయమని పుకార్లు

డబుల్ ధమాకా ఖాయమని పుకార్లు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా కథ, రామ్ చరణ్ పాత్ర గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. అయితే, ఇది డుయల్ రోల్ మాత్రం కాదని తెలుస్తోంది. ఇద్దరిలా కనిపిస్తూ మాయ చేయడమే సినిమా కథ అని చివర్లో ఈ ట్విస్ట్ రివీల్ అవుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X