రాజమౌళితో విఫలమైన చిరంజీవి ప్రయత్నాలు.. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్‌కు నిరాశే
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా మల్టీస్టారర్ మూవీ యుగం నడుస్తోంది. ఇప్పుడు పాత, కొత్త డైరెక్టర్లందరూ ఆ తరహా చిత్రాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అలాంటి కథలు రెడీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫ్యాన్స్ ఆలోచనా ధోరణిలో మార్పు రావడం వల్లే అటు హీరోలు కానీ, ఇటు దర్శకులు కానీ మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 'ఆచార్య'లో నటిస్తున్నారు. అయితే, ఈ మూవీ నుంచి చెర్రీ తప్పుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

తండ్రితో ప్రయోగాలు.. చరణ్ టార్గెట్ మిస్
సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత ‘సైరా: నరసింహారెడ్డి'తో తండ్రికి మరో భారీ విజయాన్ని ఇవ్వాలనుకున్న చెర్రీ టార్గెట్ మిస్ అయిపోయింది.

బడా డైరెక్టర్‌తో కలిసిన మెగాస్టార్ చిరంజీవి
‘సైరా: నరసింహారెడ్డి' వంటి భారీ చిత్రం తర్వాత చిరు.. బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ‘ఆచార్య' అనే మూవీ చేస్తున్నారు. దీన్ని కూడా రామ్ చరణే నిర్మిస్తుండగా, మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుందని ప్రకటన వెలువడింది. అయితే, ఈ మధ్య ఆమె మూవీ నుంచి తప్పుకుందని ఓ న్యూస్ వైరల్ అయింది.

అప్పుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు చిరు
తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా సందేశాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. దేవాదాయ భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే నక్సలైట్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పటికే లీక్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ‘జల్సా'లో పవన్ కూడా నక్సలైట్‌గా కనిపించాడు.

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ కీ రోల్
‘సైరా: నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించబోతున్నారని ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ‘ఆచార్య'లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడని చిత్ర యూనిట్ పరోక్షంగా వెల్లడించింది. ఆ తర్వాత చిరు దీన్ని కన్ఫార్మ్ చేశారు. దీంతో మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్ ఔట్.!
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘ఆచార్య'లో రామ్ చరణ్ 30 నిమిషాలు కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అతడికి, చిరంజీవి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇందులో చెర్రీ చిరంజీవికే గురువుగా దర్శనమిస్తాడని అన్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి చరణ్ తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ ప్రచారం అవుతోంది.

షాకింగ్: చిరంజీవి ప్రయత్నాలు విఫలం
వాస్తవానికి ఈ మూవీలో చరణ్ నటించడం ఖాయమైంది. అందుకోసం దర్శకుడు రాజమౌళి నుంచి పర్మీషన్ కూడా వచ్చింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా RRR షూటింగ్ కూడా నిలిచిపోవడంతో జక్కన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘ఆచార్య' నుంచి చెర్రీ తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ నేపథ్యంలో చిరు ప్రయత్నాలు చేసినా విఫలం అయ్యాయని సమాచారం.
Recommended Video

ఆ దర్శకుడు కూడా కన్ఫార్మ్ చేసేసినట్లే
ఇటీవల ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ కూడా ‘ఈ మూవీలో చరణ్ పాత్ర ఉంటుందా.? ఉండదా.? అన్న విషయం అప్పుడే చెప్పలేము. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో.. అన్నీ కుదిరితేనే ‘ఆచార్య'లో చరణ్ నటిస్తాడు' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ డైరెక్టర్ పరోక్షంగా చరణ్ ఇందులో నటించడం లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











