అలా చెయ్యకపోతే 'ఆరెంజ్' చిత్రం తెలంగాణలో ఆడనివ్వం
రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం "ఆరెంజ్" చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు తెలంగాణా వారికే ఇవ్వాలని కోరుతూ మెదక్ జిల్లా రామచంద్రాపురం స్వయంకృషి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మంగళవారం సాయింత్రం గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యుషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. చిరంజీవి ఫ్యాన్స్ శ్రీకాంత్, ఏడుకొండలు, సాయిలు తదితరులు మాట్లాడుతూ..ఆరెంజ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తెలంగాణవారికే ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం ఆంధ్రావారికే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆరెంజ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ దగ్గకపోతే తెలంగాణలో ఆడనివ్వం అని హెచ్చరించారు. రామ్ చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్‌లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
తెలంగాణ రామ్ చరణ్ తేజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు ఆరంజ్ telangana bhaskar ram charan teja genelia nagababu orange


Click it and Unblock the Notifications