ఇక మళ్ళీ ఆ మెగా చక్రాన్ని చరణే తిప్పాలి...!?
మెగాస్టార్ 'చిరు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్ చేసిన రెండో చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మూడో ప్రయత్నం బెడిసి కొట్టడంతో, రెండో చిత్రంతో వచ్చిన కీర్తి మొత్తం డైరెక్టర్ రాజమౌళిదే అని పండితులు సైతం లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ 'మగధీర"లో చేసిన కొన్ని సీన్స్, మిగతా ఏ హీరోకైనా అసాధ్యమనే స్థాయిలో చేసినా హిట్ మాత్రం రాజమౌళి అకౌంట్ లోనే వేస్తున్నారు.
అందుకే వరుసగా నాలుగైదు చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నా దూకుడు కొట్టిన హిట్ కి మహేష్ ని నెంబర్ వన్ హీరో అని తేల్చేస్తున్నారు. 'దూకుడు" లెక్కలు సరిగా లేకపోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ మూవీదే అగ్రస్థానం అని చూపిస్తున్నారు. ఇది మెగాభిమానులు మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీ నెంబర్ వన్ అనిపించుకోగల స్టామినా ఉన్న పవర్ స్టార్ కూడా మెయిన్ దర్శకులను ప్రక్కన పెట్టి, తమిళ వాసనలో మునిగిపోవడంతో ఇంక ఇండస్ట్రీ చక్రాన్ని మెగా కంట్రోల్ కి తెచ్చుకోవాలంటే అది చరణ్ కే సాధ్యం అని, రాబోతున్న అతని చిత్రాలపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు మెగాభిమానులు.


Click it and Unblock the Notifications











