రష్మిక మాకొద్దు బాబోయ్ అంటున్న టాప్ హీరో ఫ్యాన్స్ .. అంతలా ఏం చేసిందంటే?

ఇపుడు సౌత్ ఇండియా సినిమా నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో మంచి స్టార్డమ్ ఉన్న హీరోయిన్స్ కొద్దిమందే కనిపిస్తారు. ఈ కొంతమందిలో టాప్ ప్లేస్‌లో మాత్రం ఉన్నది నేషనల్ క్రష్ రష్మిక మందన్న అని చెప్పాలి. రష్మిక సౌత్ ఇండస్ట్రీలో ప్రస్థానం మొదలుపెట్టి నుంచి పాన్ ఇండియా లెవెల్లో టాప్ హీరోయిన్ గా తాను మారిపోయింది. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.

ఇక తన నుంచి పాన్ ఇండియా అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2తో మళ్ళీ ఇండియన్ సినిమాని షేక్ చెయ్యడానికి వస్తుంది. అలాంటి రష్మికపై కూడా కొన్ని అంశాల్లో ట్రోల్స్ లేకపోలేదు. రీసెంట్ గానే ఆమె లుక్స్ పరంగా, అలాగే తన బోల్డ్ సాంగ్ పీలింగ్స్ లో చూపించిన హాట్ షో , అల్లు అర్జున్ తో వేసిన స్టెప్పులు మరోసారి తనపై విమర్శలు తీసుకొచ్చాయి.

ram charan fans saying no to rashmika for rc17

కాగా ఇప్పుడు మరో అంశంలో తనపై నెగిటివిటీ వస్తుంది. ఈ మధ్య కాలంలో రష్మిక మందన్నా ఓ స్టార్ హీరో సినిమాకి ఓకే చేస్తున్నారు అంటే చాలు తొలుత తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అంతెందుకు ఇపుడు పుష్ప 1 సినిమాకి హీరోయిన్‌గా తీసుకున్న సమయంలోనూ తన ఎంపికపై నెగిటివ్ వచ్చింది. కానీ శ్రీవల్లిగా తన టాప్ లెవల్ పెర్ఫామెన్స్ తో అందరికీ సమాధానం ఇచ్చింది రష్మిక.

ఇపుడు మాత్రం మెగా ఫ్యాన్స్ తన విషయంలో డిజప్పాయింట్ గా ఉన్నారని చెప్పాలి. దీనికి రష్మిక నిన్న పుష్ప 2 ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తుంది. పుష్ప ఈవెంట్ లో రష్మిక మందన్నా ట్రై చేసిన కొత్త స్పీచ్ చాలా మందికి వెగటు పుట్టింది. ప్రధానంగా మళ్ళీ సుకుమార్ తో ఆమె వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పడం స్పెషల్ గా మారింది.

ram charan fans saying no to rashmika for rc17

దీనితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే సుకుమార్ నెక్స్ట్ సినిమాల్లో ఆల్రెడీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ మూవీ ఉంది. ఇపుడు చరణ్ .. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో తన 16వ చిత్రం చేస్తుండగా.. అది పూర్తయిన వెంటనే 17వ చిత్రం సుకుమార్ తో చేయనున్నాడు. నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలతో రష్మిక మందన్నా మాత్రం మాకు వద్దు బాబోయ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.

చరణ్ సినిమాతో కనుక ఈమె ఉంటే ఎవరో కాదు మేమే సినిమాని బాయ్ కాట్ చేస్తాం అంటున్నారు. దీనితో రష్మిక పట్ల మాత్రం మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా లేరని చెప్పి తీరాలి. మరి ఒకవేళ నిజంగానే రామ్ చరణ్ సినిమాలో ఈమెనే మళ్ళీ ఓకే చేస్తే మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ లోపు సుకుమార్ ఎవరితో ప్లాన్ చేస్తాడో లేక లాంగ్ గ్యాప్ ఏమన్నా తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X