రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ..హృతిక్ రోషన్ కి రీప్లేస్
రామ్ చరణ్ తేజ్ త్వరలో 'వెల్ కమ్ టు జంగిల్' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. 'అల్లా కే భందే' అనే చిత్రం రూపొందించిన ఫరూక్ కబీర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. మొదట ఈ చిత్రం కథ అనుకున్నప్పుడు హృతిక్ రోషన్ అనుకుని తయారు చేసుకున్నారు. అయితే హృతిక్ డేట్స్ దొరకక పోవటంతో దర్శకుడుకి రామ్ చరణ్ అయితే ఆ పాత్రకి సరిపోతాడని భావించాడని చెప్తున్నారు. దానికి కారణం..దర్సకుడు మగధీర చిత్రం చూడటమేనట. ఇక ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూక్ కబీర్ మాట్లాడుతూ 'అవును నిజమే రామ్ చరణ్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. నా నిర్మాతలు రవి, వాలియా ముష్తాక్ షేక్ అతన్ని హైదరాబాద్ లో కలిసారు, ఆరంజ్ షూటింగ్ కు ముంబై వచ్చినప్పుడు నేను అతన్ని కలిసాను. కానీ ఏ విషయాన్నీ ఖచ్చితంగా చెప్పలేను ఇంకా ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు' అన్నాడు. ఇక గతంలోనూ రామ్ చరణ్..దిల్ చాహతా హై దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో చేయనున్నాడనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే అక్తర్ అలాంటి ఆలోచన ఏమి లేదు జస్ట్ రామ్ చరణ్ తో వర్క్ చేస్తే బాగుంటుంది అని మాత్రమే అని అక్కడకి బ్రేక్ వేసాడు. ఇక ఈ 'వెల్ కమ్ టు జంగిల్' ప్రాజెక్టు..రామ్ చరణ్ కి 'వెల్ కమ్ టు బాలీవుడ్' గా మారుతుందేమోనని చూడాలి.


Click it and Unblock the Notifications











