చిరంజీవి కోసం లైఫ్ రిస్క్ చేస్తున్న చరణ్.. ఏ స్టార్ హీరో చేయని సాహసానికి సిద్ధం.!

By Manoj

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా... అద్భుతమైన నైపుణ్యాలతో తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకోవడంతో పాటు స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి కోసం లైఫ్ రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు చరణ్. ఆ వివరాలు మీకోసం.!

చరణ్‌పై ఆ సినిమా ప్రభావం.. పక్కా ప్లాన్స్

చరణ్‌పై ఆ సినిమా ప్రభావం.. పక్కా ప్లాన్స్

‘రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న రామ్ చరణ్... ఆ వెంటనే ‘వినయ విధేయ రామ' అనే సినిమా చేశాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అంతేకాదు, ఈ మూవీలో కొన్ని సీన్లపై విమర్శలు చెలరేగాయి. దీంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడీ మెగా హీరో.

ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమైన మెగా హీరో

ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమైన మెగా హీరో

తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్... జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో చెర్రీ.. అల్లూరిగానూ, తారక్.. కొమరం భీంగానూ నటిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చెర్రీ విషయంలో ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ

చెర్రీ విషయంలో ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ

రామ్ చరణ్ నటించిన గత చిత్రం ‘వినయ విధేయ రామ' విడుదలై దాదాపు ఇరవై నెలలు కావొస్తుంది. అయినప్పటికీ.. అతడి నుంచి మరో సినిమా రాలేదు. ఇక, ప్రస్తుతం చేస్తున్న RRR ఎప్పుడు విడుదల అవుతుందో కూడా క్లారిటీ లేదు. దీంతో తమ అభిమాన హీరో సినిమా లేక ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. అదే సమయంలో కొత్త సినిమా ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.

తర్వాతి సినిమా ఎవరితో.. ఇప్పుడిదే చర్చ

తర్వాతి సినిమా ఎవరితో.. ఇప్పుడిదే చర్చ

RRR తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాపై కొన్నేళ్లుగా చాలా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తద్వారా రామ్ చరణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కానీ, ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రావడం లేదు. దీంతో అసలు ఈ మెగా హీరో సినిమా ఎవరితో ఉంటుందన్న దానిపై ఫ్యాన్స్‌లో అయోమయం నెలకొంది.

తండ్రితో మల్టీస్టారర్... అతడిదే కీలక పాత్ర

తండ్రితో మల్టీస్టారర్... అతడిదే కీలక పాత్ర

ప్రస్తుత పరిస్థితుల్లో మెగా అభిమానులకు ఊరటనిచ్చే అంశం ఏదన్నా ఉందా అంటే... అది ‘ఆచార్య' సినిమానే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే ఈ పాత్రలో అతడు నక్సలైట్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. చరణ్ పోషించే ఈ పాత్ర సినిమాకే హైలైట్ కానుందట.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
ఏ స్టార్ హీరో చేయని సాహసానికి సిద్ధం.!

ఏ స్టార్ హీరో చేయని సాహసానికి సిద్ధం.!

‘ఆచార్య'లో చరణ్ పోషించే పాత్ర గురించి ఓ క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సినిమాలో అతడు కొంచెం లావుగా కనిపించబోతున్నాడట. అందుకోసం ఏ హీరో చేయని విధంగా ఫ్యాట్‌గా తయారవబోతున్నాడట ఈ మెగా హీరో. అయితే, RRRలో మాత్రం ఫిట్‌గా దర్శనమివ్వనున్నాడు. అంటే... రెండు సినిమాలకు రెండు రకాల మేకొవర్లు ట్రై చేస్తున్నాడన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X