Game Changer: అప్పన్నగా రామ్ చరణ్ సెన్సేషన్.. ఆ లోపం ఉన్న వ్యక్తిగా షాకింగ్ రోల్
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే తమదైన మార్కును చూపించి స్టార్లుగా దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. తన రేంజ్‌ను అమాంతం పెంచుకుంటున్నాడు. అదే సమయంలో గ్లోబల్ స్టార్‌గా మారాడు. దీంతో మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.
హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 70 శాతం వరకూ మాత్రమే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది.

పెద్ద పెద్ద స్టార్లు కలిసి చేస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌ను ఆ మధ్య పున: ప్రారంభించారు. అలా కొన్ని షెడ్యూళ్లను కూడా చేసుకుంటూ వచ్చారు. అంతలోనే మళ్లీ బ్రేక్ వేసేశారు. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని మొదలు పెట్టి.. ఇక ఏమాత్రం బ్రేకులు లేకుండా జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది చివరి నాటికి దీన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న స్టోరీలైన్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ పాత్రపై మరింత సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో అతడు రెండు పాత్రలు చేస్తున్నాడు. అందులో తండ్రి పాత్రకు అప్పన్న అనే పేరును పెట్టినట్లు అసలు మేటర్ లీకైంది.

అంతేకాదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలో తండ్రి పాత్రను పోషించే రామ్ చరణ్ నత్తి (మాటలు తడబడడం) సమస్య ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. అతడి నుంచి వచ్చే పొలిటికల్ డైలాగులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయని అంటున్నారు. కొడుకు, తండ్రి పాత్రల మధ్య వైవిధ్యం కనిపించడం కోసమే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై హైప్ మరింతగా పెరుగుతోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











