»   » సొంతగా ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్న రామ్ చరణ్?

సొంతగా ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్న రామ్ చరణ్?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో సినీ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఆయన మెగా ఫ్యామిలీకి సొంత సినీ స్టూడియో లేని లోటును పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అది జరుగాలంటే ముందుగా ఏపీలో సినీ స్టూడియోల నిర్మాణం జరుగాలి. ఇందులో భాగంగా వైజాగ్‌, అమరావతిలో ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేసేలా ఫిల్మ్ మేకర్స్‌ను పోత్సహిస్తోంది.

  హామీలు ఇస్తున్న మంత్రులు

  హామీలు ఇస్తున్న మంత్రులు

  ఏపీలో జరిగే సినిమా ఫంక్షన్లకు హాజరయ్యే మంత్రులు గంటా శ్రీనివాసరావు తదితరులు సైతం..... ఆయా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం తరుపున రాయతీలు ఇస్తామనే హామీలు కూడా ఇస్తోంది.

  వైజాగ్ బీచ్ రోడ్డులో?

  వైజాగ్ బీచ్ రోడ్డులో?

  ఈ నేపథ్యంలో వైజాగ్ బీచ్ రోడ్ ప్రాంతంలో రామ్ చరణ్ సొంత స్టూడియో నిర్మిచేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో రామ్ చరణ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. గతంలోనూ రామ్ చరణ్ హైదరాబాద్ సమీపంలో స్టూడియో నిర్మాణానికి భూమి కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి.

  గంట మద్దతు...?

  గంట మద్దతు...?

  మెగా ఫ్యామిలీకి మంత్రి గంట శ్రీనివాసరావు సపోర్ట్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో పలు మెగా ఫ్యామిలీ పంక్షన్లకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భాల్లోనూ వైజాగ్‌లో స్టూడికయో ఏర్పాటు చేయాలనే ప్రస్తావన తెచ్చారు.

  రామ్ చరణ్

  రామ్ చరణ్

  కాగా ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. మరో వైపు ‘సైరా' చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  English summary
  Ram Charan is reportedly toying with the idea of setting up a sprawling film studio on the Vizag Beach Road. However, these are mere speculations and we will have to wait until an official word comes from the horse’s mouth. Charan is currently busy with RC12 in Boyapati’s direction. He is also producing his father Megastar Chiranjeevi’s Sye Raa.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more