రామ్ చరణ్, దిల్ రాజు కాంబినేషన్ కన్ఫర్మ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో రామ్ చరణ్ హీరోగా చిత్రం నిర్మించనున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో బృందావనం చిత్రం రూపొందించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ చిత్రం జూన్ 2011 నుంచి ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం దిల్ రాజు..ప్రభాస్ హీరోగా దశరధ్ దర్శకత్వంలో మిస్టర్ ఫెరఫెక్ట్ అనే చిత్రం నిర్మిస్తున్నారు. అలాగే సిద్దార్ధ హీరోగా వేణు శ్రీరామ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఓహ్..మై ప్రెండ్ అనే చిత్రం కూడా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం రామ్ చరణ్...ధరణి దర్శకత్వంలో మెరుపు అనే చిత్రం చేస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్ వంశీ పైడిపల్లి దిల్ రాజు మెరుపు దశరధ్ ram charan teja vamsi paidipally dil raju merupu dharani


Click it and Unblock the Notifications