రెమ్యునేషన్ గా రామ్ చరణ్ కి నైజాం రైట్స్
హైదరాబాద్: రామ్ చరణ్ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న నేపధ్యంలో ఆయన తన సంపాదనాఅవకాశాలు మెరుగుపరుచుకోవాలనుకుంటునే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన తన చిత్రం ఎవడు నైజాం రైట్స్ ని తన రెమ్యునేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఉభయగోదావరి జిల్లా హక్కులను ఇప్పటికే గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. ఇక మిగిలిన ఏరియాలను దిల్ రాజు మార్కెట్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇలా రైట్స్ తీసుకోవటం హీరోలకు కొత్తమీ కాదు చాలా మంది హీరోలు గతంలో చిరంజీవి కూడా ఇలా తీసుకున్నవారే కావటం గమనార్హం.
ఇక రామ్ చరణ్ తాజా చిత్రం 'ఎవడు' షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆయన సరసన శృతి హాసన్, అమీజాక్సన్ జోడీలు. తొలుత ఈ చిత్రం కోసం సమంతను కథానాయికగా ఎంపికచేసి, ఆ తర్వాత ఆమెకు బదులుగా శ్రుతి హాసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రలు పోషిస్తుండటం ఓ విశేషం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే కొంతభాగం పూర్తిచేసుకోగా, ప్రస్తుతం రామ్ చరణ్, జయసుధ తదితరులు పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. రామ్ చరణ్‌కు మరింత పేరు తెచ్చిపెట్టే స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని మలచడం జరుగుతోందని దిల్ రాజు అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ''రామ్ చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











