రామ్ చరణ్ ఆరెంజ్ లో ఇంద్ర స్టెప్స్
చిరంజీవి..ఇంద్ర చిత్రం కోసం చేసిన వీణ స్టెప్స్ ని ఎవరూ మరిచిపోలేరు.రాఘవ లారెన్స్ సమకూర్చిన ఆ స్టెప్స్ లాంటివే మరోసారి రామ్ చరణ్ కూడా చేయబోతున్నాడని సమాచారం. అతని లేటెస్ట్ చిత్రం ఆరెంజ్ కోసం ఈ వీణ స్టెప్స్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ సారి కూడా లారెన్స్ నేతృత్వంలోనే ఆ పాటలను చిత్రీకరించనున్నారని వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జెనీలియా చేస్తోంది. ఇద్దరూ కలిసి ఈ వీణ పాటలో కనిపిస్తారు. మూడు రకాలుగా వీణ స్టెప్స్ ని కంపోజ్ చేసి రామ్ చరణ్ కి చెప్పారని, అతనికి ఇష్టమైన దానిని ఎంపిక చేసుకుంటాని చెప్తున్నారు. ఇక ఆరెంజ్ చిత్రాన్ని నాగబాబు..తమ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ లారెన్స్ నాగబాబు bommarillu bhaskar indra lawrence orange nagababu chiranjeevi b gopal


Click it and Unblock the Notifications