మహేష్ కోసం మెగా హీరో.. బన్నీ కోసం యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్
వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగేందుకు పందెం కోళ్లు రెడీ అయ్యాయి. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. టీజర్‌తో అమాంతం అంచనాలు పెంచేసిన సరిలేరు టీమ్.. పాటలతో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది అలవైకుంఠపురములో టీమ్. ఇలా రెండూ పోటాపోటీగా దూసుకుపోతుండగా.. బరిలో నిలిచిదేవరు? గెలిచేదెవరు? అన్న బెట్టింగ్‌లు మొదలయ్యాయి. అయితే ఈ మూవీలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ వచ్చేసింది.

మెగా ఫ్యామిలీని దింపుతోన్న సరిలేరు..
మహేష్ గత చిత్రాలైన ‘భరత్ అనే నేను' చిత్రానికి ఎన్టీఆర్, ‘మహర్షి' సినిమాకు వెంకటేష్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు విచ్చేశారు. ఇక ఈసారి కూడా ఓ స్టార్ హీరోను గెస్ట్‌గా పిలవబోతోన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని గానీ, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ను గానీ ఈ వేడుకలో మెరవబోతోన్నట్లు టాక్.

బన్నీ కోసం యంగ్ టైగర్..
సరిలేరు టీమ్ మెగా హీరోలను దింపితే.. బన్నీ మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను దింపే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే రెండు ఈవెంట్లలో అభిమానుల హడావిడి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోలుంటే ఎలా ఉంటుందో గత ఈవెంట్లో చూశాం.

ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పంచుకుంటారా?
దర్శకధీరుడు రాజమౌళి చేతిలో ఉన్న ఈ ఇద్దరి హీరోలను చెరొక పందెంకోడి పంచుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రతీ విషయంలో పోటీ పడుతున్న రెండు చిత్రాలు ఇలా కూడా తమ పంథాను వదిలినట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఇదే నిజమైన మహేష్ వేడుకకు చరణ్, బన్నీ వేడుకకు ఎన్టీఆర్ హాజరైతే ఇక రచ్చ రచ్చే.

నిజమయ్యే అవకాశాలే ఎక్కువ..
మహేష్-చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఒక వేళ మహేష్ అడిగితే రామ్ చరణ్ కాదనడన్నది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు ఉన్నది గురూజీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెబితే ఎన్టీఆర్ రాకుండా ఉంటాడా?. సో ఏ విధంగా చూసినా ఈ వార్తలు నిజమయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగతుందో.


Click it and Unblock the Notifications











