రామ్ చరణ్ దిమ్మతిరిగే ప్రయోగం.. ఇలా చేస్తున్న తొలి తెలుగు హీరోగా!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రచ్చ లేపుతూ దూసుకుపోతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొట్టడంతో పాటు గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా అందుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను రామ్ చరణ్ ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. దీంతో 16వ చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు.

రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు సనతో చేయబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ చిత్రం గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇది స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్ స్టోరీతో రాబోతుందని, ఇందులో రామ్ చరణ్ రన్నర్‌గా నటిస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్నో అంచనాల నడుమ ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎలాంటి పాత్రను చేస్తున్నాడు అన్న దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అంతేకాదు, ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాల్సిన అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనే నేపథ్యంతో ఈ మూవీ వస్తుందట. ఇక, తాజాగా ఈ మూవీలో అతడి గెటప్ గురించి న్యూస్ లీకైంది.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రం రామ్ చరణ్ పూర్తి స్థాయి రఫ్ లుక్‌లో అంటే గుబురు గెడ్డంతో ఊరమాస్‌గా కనిపించబోతున్నాడట. ఒకరకంగా చెప్పాలంటే తమిళ చిత్రాల్లో హీరోల లుక్ మాదిరిగా ఇది ఉండబోతుందట. దీంతో ఈ సినిమాలో గెటప్ 'రంగస్థలం' రామ్ చరణ్ చేసిన పాత్రను మరిపించడం ఖాయం అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు సన - రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది.


Click it and Unblock the Notifications