Game Changer vs Pushpa 2: మెగా ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ.. పుష్ప ఎఫెక్ట్ తో గేమ్ ఛేంజర్ వెనక్కి!

Game Changer vs Pushpa 2: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ వస్తున్న ఈ మూవీలో రామ్‌ చరణ్‌ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్‌' రాజు ప్రొడక్షన్స్‌ వారు సంయుక్తం నిర్మిస్తున్న ఈ మూవీ సినిమా డిసెంబర్ లో కాకుండా .. సంక్రాంతికి విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగిందో? ఆ రూమర్స్ వెనుక కారణమేంటో ఓ లూక్కేయండి.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, ఎస్‌జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి తదితరులు లీడ్ రోల్ కనిపించనున్నారు. రామ్​ చరణ్ - శంకర్ కాంబోలో రానుండ‌టంతో మూవీపై భారీ హైప్స్ పెరిగాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కోసం గోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.

Ram Charan game changer movie will be postponed due to Arjun Pushpa 2 movie effect

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందనే మూవీ మేకర్స్ కూడా పలు సందర్బాల్లో ప్రకటించారు. కానీ, ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. 'గేమ్‌ చేంజర్‌'వాయిదా పడిందా? ఒకవేళ వాయిదా పడితే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? వాయిదాకు గల కారణాలేంటీ? అనే విషయాలకు వస్తే..

గత వారం రోజులుగా గేమ్స్ మూవీ వాయిదా పడుతుందని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి ప్రధాన కారణం సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 వల్లే అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్ 1 మూవీ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. పాన్ ఇండియా వైడ్ గా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఎలాంటి హైప్స్ లేకుండా విడుదలైన పుష్ప మూవీ పులు రికార్డు చేసి.. ఇండస్ట్రీలో ప్రభంజనం స్రుష్టించింది. మరీ భారీ అంచనాలతో రాబోతున్న పుష్ప 2 మూవీ ఎలా ఉంటుంది మరీ.

Ram Charan game changer movie will be postponed due to Arjun Pushpa 2 movie effect

ఇప్పటికే పుష్ప 2 మూవీ నుంచి విడుదలై గ్లిప్స్,టీజర్, సాంగ్స్ లకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి 'పుష్ప 2' మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 6కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీకి పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి వరకూ బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్‌ హల్ చల్ చేస్తాడు. బన్నీ సునామీ ముందు చిన్న సినిమాలు కొట్టుకపోవాల్సిందే. ఒక వేళ మిక్స్‌డ్ టాక్ వచ్చినా దాదాపు రూ.1000 కోట్లు వసూలు చేయగల సత్తా 'పుష్ప 2' మూవీకి ఉందనే అంచనా వేస్తున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. లేదా ఏదైనా తేడా వచ్చినా.. బన్నీ క్రేజ్ బట్టి చూస్తే దాదాపు రూ.600 కోట్లు రాబట్టవచ్చు.

సో.. ఏ సినిమాలకు కూడా పుష్ప స్పీడ్‌ని అందుకోవడం, ఆ రేంజ్ ను తట్టుకోవడం కష్టమే. ఈ కారణాలతో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డిసెంబర్ నుంచి జనవరి సంక్రాంతికి షిఫ్ట్ అవుతుందనీ, ఈ పరిణామాలను ఊహించిన తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు గేమ్ ఛేంజర్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడమే బెటర్ అని భావిస్తున్నారట. ఈ ప్రచారం నేపథ్యంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి. మరీ మూవీ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X