రామ్ చరణ్ తో గ్యాంగ్ లీడర్ చిత్రం కన్ఫర్మ్..డిటేల్స్
ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీ హిట్ సినిమాల్లో రామ్ చరణ్ కి ఏది ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది, చరణ్ ని ఏ సినిమా చెయ్యమని సలహా ఇస్తారని చిరంజీవిని అడిగితే 'అందరికీ రీచ్ కావాలంటే గ్యాంగ్ లీడర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడది నిజం కాబోతోందని సమాచారం. రామ్ చరణ్ త్వరలో గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నారు. మాగంటి రవీధ్రనాధ్ చౌదరి కుమారుడు మాగంటి రామ్ జి ఈ చిత్రం నిర్మించాలని ఆసక్తిగా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఆ టైటిల్ ని నమ్మి పూరి జగన్నాధ్ ని ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంపికచేసుకుని అడ్వాన్స్ ఇచ్చారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ మాత్రమే ఉంటుందని పూరీ కొత్త కథను రెడీ చేస్తున్నారని కూడా వినపుడుతోంది. ఏదైమైతేనేం గ్యాంగ్ లీడర్ టైటల్ తో రామ్ చరణ్ హీరోగా సినిమా మాత్రం కన్ఫర్మ్ గా వస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్...సంపత్ నంది దర్సకత్వంలో రచ్చ చిత్రం లో నటించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications