సూపర్ మ్యాన్ కాన్సెప్టుతో రామ్ చరణ్ చిత్రం
రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లో తమిళ దర్శకుడు ధరణి రూపొందిస్తున్న చిత్రంలో రామ్ చరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం గురించి మరో తాజా సమాచారం ఏమిటంటే...ఈ చిత్రం సూపర్ మ్యాన్ కాన్సెప్టుతో తయారవుతోందని. ఇంతకు ముందు హిందీలో సూపర్ హిట్ నమోదు చేసిన హృతిక్ రోషన్ క్రిష్ లాగా పిల్లా పెద్దలను అలరించే సబ్జెక్టు చేస్తానని రామ్ చరణ్ చెప్పటంతో ఈ ప్రాజెక్టు ఓకే అయిందిట. అలాగే ఈ చిత్రం ఓ యాక్షన్ పేకెడ్ ధ్రల్లర్ అని చెప్తున్నారు. చాలా ట్విస్ట్ లు టర్న్ లతో ఆద్యతం ఓ ఎడ్వెంచర్ లాగ కొనసాగుతుందని చెప్తున్నారు. గతంలో విజయ్ చిత్రంతో పరిచయమైన భరతన్ ఈ చిత్రంకి కథ అందించి తమిళంలో డైలాగులు రాసాడుట. ఇక సామాన్యుడు ...అసామాన్యుడుగా ఎదిగి మెరుపులా ప్రత్యక్షమవుతూ సాహసాలు చేస్తాడని, అలాగే హీరో సూపర్ మ్యాన్ గా మారటానికి మెరుపు ఓ కారణమవుతుందని అంటున్నారు. అందుకే మెరుపు అనే టైటిల్ పెట్టారని జస్టిఫై చేస్తున్నారు. ఇక ధరణి ఇంతకు ముందు తెలుగులో పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం చేసారు. అలాగే తమిళంలో రీసెంట్ గా విజయ్,త్రిషలతో కురువై అనే డిజాస్టర్ చిత్రం తీసాడు.


Click it and Unblock the Notifications











