బాలీవుడ్‌లోకి రామ్ చరణ్: ఇండియాను కాపాడిన రాజు బయోపిక్‌లో.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే!
సినిమాల్లోకి ఎంటరైన కొత్తలోనే తనలోని అన్ని టాలెంట్లను బయటపెట్టడంతో పాటు ఎన్నో విజయాలను అందుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలా సుదీర్ఘ కాలంగా తనదైన సినిమాలను చేస్తూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు. ఇక, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన అతడు.. వరుసగా భారీ ప్రాజెక్టులనే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు రెండు పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్.. మరో చారిత్రక సినిమాను చేయబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలను మీరే చూడండి!
గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ సగం కంటే ఎక్కువే పూర్తైంది. దీన్ని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

బుచ్చిబాబుతో మరో మూవీ
రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనతో చేయబోతున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'గేమ్ చేంజర్'ను పూర్తి చేసిన వెంటనే దీన్ని మొదలెట్టబోతున్నారు.
ఆ డైరెక్టర్లనూ లైన్‌లో పెట్టి
గ్లోబల్ స్టార్ అయిన తర్వాత రెట్టించిన జోష్‌తో కనిపిస్తోన్న రామ్ చరణ్.. ఇప్పుడు చేస్తున్న చిత్రాల తర్వాత మరిన్ని ప్రాజెక్టులను చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్ వంటి బడా డైరెక్టర్లతో చర్చలు జరిపాడు. అంతేకాదు, వీటిలో కొన్ని కాంబినేషన్‌లు కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

సుహెల్‌దేవ్ బయోపిక్‌లో
ఇప్పటికే పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా న్యూస్ లీకైంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. చరణ్ త్వరలోనే కింగ్ సుహెల్‌దేవ్ బయోపిక్‌లో నటించబోతున్నాడని తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.
ఆ డైరెక్టర్‌తో భారీ మూవీ
సుహెల్‌దేవ్ బయోపిక్ మూవీని తెలుగులో కాకుండా హిందీలో చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారట. ఇది 'బహ్రైచ్ యుద్ధం' నేపథ్యంతో రూపొందబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనే ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది.

అసలు సుహెల్ ఎవరు?
రామ్ చరణ్ చేస్తున్న బయోపిక్ అని తెలియడంతో అసలు సుహెల్‌దేవ్ ఎవరు అని అంతా వెతుకుతున్నారు. ఆయన 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించిన రాజు. గజ్నవిద్ దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు సుహెల్ తన సైన్యంతో వాళ్లను మట్టికరిపించి దేశాన్ని కాపాడాడు. అందుకే ఆయనను 'ఇండియాను కాపాడిన రాజు' అంటారు.


Click it and Unblock the Notifications











