స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో రామ్ చరణ్: ఏకంగా అన్ని భాషల్లో.. ఆ స్పెషల్ డేనే సర్‌ప్రైజ్
హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను దక్కించుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ మధ్య కాలంలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయిన తర్వాత అతడితో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చరణ్.. భారత క్రికెటర్ కోహ్లీ బయోపిక్‌లో నటించబోతున్నాడట. ఆ వివరాలు మీకోసమే!
గేమ్ చేంజర్‌గా రామ్ చరణ్:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ సగం కంటే ఎక్కువే పూర్తైంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

బుచ్చిబాబుతో మరో మూవీ:రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనతో ప్రకటించాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'గేమ్ చేంజర్'ను పూర్తి చేసిన వెంటనే దీన్ని పట్టాలెక్కిస్తారట.
ఆ డైరెక్టర్లతోనూ సినిమాలు:గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్న రామ్ చరణ్.. ఇప్పుడు చేస్తున్న చిత్రాల తర్వాత మరిన్ని ప్రాజెక్టులను చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్ వంటి బడా డైరెక్టర్లతో చర్చలు జరిపాడు. అంతేకాదు, వీటిలో కొన్నింటిని చేసేందుకు రెడీ కూడా అయినట్లు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో:చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. చరణ్ త్వరలోనే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించబోతున్నాడని తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఆరోజునే అనౌన్స్‌మెంట్:విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడన్న టాక్ మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా ప్రకటన కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 5వ తేదీన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

బడా సంస్థ.. పాన్ వరల్డ్:రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందనున్న విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీని బాలీవుడ్‌లోనే టాప్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుందట. ఇందుకోసం భారీ బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలిసింది. అటు కోహ్లీకి, ఇటు చరణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో.. దాదాపు పది భాషల్లో రూపొందించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











