రాణా గర్ల్ ఫ్రెండ్‌తో చెర్రీ.... మగరిసా!
తెలుగు హీరోలకు బాలీవుడ్ ఆంటీ బిపాసా బసు మంచి కాలక్షేపంగా మారింది. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన జాన్ తన నుంచి విడి పోవడంతో ఏం చేయాలో పాలు పోక ఒంటరి జీవితం గడుపుతున్న ఈ ప్రౌడ సుందరి.....టాలీవుడ్ నుంచి వచ్చిన కుర్ర హీరోలతో సంబంధాలు బాగా పెంచుకుంటోంది. దమ్ మారో దమ్ చిత్రం ద్వారా పరిచయం అయిన దగ్గుబాటి యువ హీరో రాణాతో బిపాసా నడుపుతున్న యవ్వారం బహిరంగ రహస్యమే అని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో అడుగు పెట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో కూడా బిపాసా....స్నేహం పెంచుకుంటోంది. ప్రస్తుతం 'జంజీర్' చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబై వచ్చిన చెర్రీతో రెస్టారెంట్ పార్టీలు, డిన్నర్లు సైతం కానిచ్చేస్తోందంటే వీరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ వీకెండ్ ముంబైలోని ఓ కాస్ల్టీ రెస్టారెంట్‌లో వీరి గెట్ టు గెదర్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది.
సాధారణంగా సినీ రంగంలో కాస్త సన్నిహితంగా ఉంటేనే.... వారిద్దరి మధ్య అఅఇఈ మొదలయిందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ల వ్యవహారం మరింత ముందు కెళ్లింది. మరి వీళ్ల వ్యవహారం సరిగమా... లేక మగరిసా.... త్వరలోనే తేల నుంది.
రామ్ చరణ్ తేజ్ 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ నటించిన చిత్రానికి రీమేక్.


Click it and Unblock the Notifications











