రామ్ చరణ్ ని మెగాస్టార్ గా చూడాలంటే ‘చిరు’రూటే బెస్ట్...
రామ్ చరణ్ కి అత్త పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి నటించే అవకాశాలున్నాయనే ప్రచారం చిత్రపురి సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" లైన్స్ లో చరణ్ తో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని, ఆ సినిమాలో అత్త పాత్రకి శ్రీదేవిని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. శ్రీదేవి చుట్టూ చరణ్ సినిమా గురించిన పుకార్లు చక్కర్లు కొట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చరణ్ సినిమాకీ, శ్రీదేవికి లింకు పెట్టారు.
అయితే ఆ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నవి కథానాయికగా నటిస్తుందని పుకార్లు పుట్టించారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి" చిత్రానికి చిరంజీవి కొడుకు, శ్రీదేవి కూతురుతో సీక్వెల్ తీస్తారనే క్రేజీ రూమర్ ని స్ర్పెడ్ చేశారు. అయితే అవి ఒట్టి గాలి కబుర్లేనని తర్వాత తేలిపోయింది. ఇప్పుడు మీర అత్తా అల్లుళ్ల కహానీ ఎంతవరకు నిజమవుతుందనేది కాలమే తేల్చాలి. చరణ్ తో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్న చాలా మంది దర్శకులు చిరంజీవి సూపర్ హిట్ సినిమాల ఫార్ములాలతో కథలు రాసుకుని వెళుతున్నారని తెలిసింది. చరణ్ ని నెక్స్ ట్ మెగాస్టార్ గా చూడాలనే అభిమానుల ఆశలు తీరాలంటే చిరు రూటే బెస్ట్ అని మెగా ఫ్యామిలీ కూడా భావిస్తున్నట్టుంది. చరణ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో మరి...


Click it and Unblock the Notifications











