రామ్ చరణ్ రిపేర్లు పనిలో బిజీ

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ ప్రస్తుతం రిపేర్లు పనిలో ఉన్నాడు అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ఆయన తాజాగా చేస్తున్న గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగ్ నిమిత్తం పొల్లాచ్చి లో పది రోజులు పాటు ఉండనున్నారు. అంతకుముందు రాజ్ కిరణ్, రామ్ చరణ్ మధ్య తీసిన సన్నివేశాలును ఇప్పుడు ప్రకాష్ రాజ్ తో రీప్లేస్ చేసి మళ్లీ తీస్తున్నారని సమాచారం. అలాగే చిరంజీవి చెప్పిన మార్పులుకి సంభందించిన సన్నివేశాలు కూడా ఇక్కడ తీయనున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ మాట్లాడుతూ...కృష్ణవంశీ సినిమా అంటే.. హంగామా ఏ రేంజులో ఉంటుందో తెలిసిందే. సెట్లో కనీసం 40మంది నటీనటులుంటారు. మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూనే ఉన్నా. కుటుంబ బంధాలతో సాగే కథలో కనిపించాలని చాలా రోజుల నుంచి అనుకొంటున్నా. నటుడిగా నాకూ కొత్త పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ మధ్యే ఓ పాట తెరకెక్కించాం. అందులో నా గెటప్‌ కాస్త షాకింగ్‌గా ఉంటుంది. ఆ ఫొటోల్ని త్వరలో విడుదల చేస్తాం. మేమంతా ఇంతింత అందంగా కనిపించడానికి కెమెరామెన్‌ సమీర్‌రెడ్డినే కారణం. నిర్మాత బండ్ల గణేష్‌ కూడా బాగానే ఖర్చుపెడుతున్నారు లెండి అన్నారు.

ఇక కృష్ణవంశీగారి దగ్గర ఓ గొప్ప లక్షణం ఉంది. 'నీలో ఈ సత్తా ఉంది.. దాన్ని బయటకు తీయ్‌..' అంటూ ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత చూసుకొంటే... మనలో ఇలాంటి నటుడున్నాడా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనతో పనిచేసిన హీరోలు కొత్త కోణంలో కనిపించడానికి కారణం అదే అన్నారు.

కథ గురించి చెప్తూ... కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. వచ్చినా అందులో బలవంతంగా యాక్షన్‌ ఘట్టాల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇందులో అలాంటి ప్రమాదాలేం లేవు. కావాలని ఒక్క యాక్షన్‌ ఎపిసోడ్‌నీ జోడించడం లేదు. అన్నీ కథలో భాగంగానే వస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు అంతా హుషారుగా సాగుతుంది. ఏడిపించే సన్నివేశాలు అస్సలు ఉండవు అని చెప్పారు.

Ram Charan heading for 10 days repair

హీరోయిన్ గురించి చెప్తూ... 'చందమామ'లో కాజల్‌ చాలా అందంగా కనిపించింది. ఆ తరవాత... ఆమె పాత్రకు అంతటి ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇదే.. అనుకొంటా. ఆమెని ఇందులో మరింత అందంగా చూపెడుతున్నాడు కృష్ణవంశీ. కాజల్‌ ఓ నటిగా తనని తాను పరిపూర్ణంగా ఆవిష్కరించుకొనే చిత్రం ఇదే అవుతుందని నా నమ్మకం అన్నారు.

ఇక 'గోవిందుడు..'లో పోనీటైల్‌తో కనిపిస్తా. సినిమా అంతా ఈ గెటప్‌లోనే ఉంటా. తెరపై చూసుకొంటుంటే పిలక చాలా బాగుందనిపించింది. ఇంట్లోవాళ్లు మాత్రం... పిలకను చూసి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా అత్తమ్మ 'ఆ పిలక ఎప్పుడు తీసేస్తారు చరణ్‌' అని అడుగుతుంటారు అని చెప్పారు.

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X