twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ఐడియా.. ఎన్టీఆర్‌కి చెప్పగానే! RRR పూర్తికాగానే సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇద్దరూ కలిసి సెట్స్‌పై జాలీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అంశం గురించి ఎన్టీఆర్‌కి రామ్ చరణ్ సలహా ఇచ్చారని తెలుస్తోంది. చెర్రీ ఇచ్చిన ఆ సలహాపై ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గా స్పందించారట. ఇంతకీ ఏంటా సలహా? వివరాల్లోకి పోతే..

    స్టార్ హీరోలే కాదు బిజినెస్ మ్యాన్లు కూడా

    స్టార్ హీరోలే కాదు బిజినెస్ మ్యాన్లు కూడా

    నేటితరం స్టార్ హీరోలంతా కేవలం స్టార్ హీరోలుగానే కాక బిజినెస్ మ్యాన్లుగా కూడా కీర్తించబడుతుండటం గమనించవచ్చు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా అందరూ వ్యాపార రంగంలో తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలు ఉండగా ఇటీవలే విజయ్ దేవరకొండ కూడా యాడ్ అయ్యాడు.

    యంగ్ టైగర్‌ని చూస్తే.. ఇదీ పరిస్థితి

    యంగ్ టైగర్‌ని చూస్తే.. ఇదీ పరిస్థితి

    తోటి హీరోలంతా వ్యాపార కార్యకలాపాల్లో జోరు మీదుంటే యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ మాత్రం కేవలం సినిమాలే లోకంగా భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. దాదాపు 20 సంవత్సరాల సినీ జర్నీలో ఆయన రాజకీయాల వైపు చూశారే గానీ వ్యాపారం వైపు మాత్రం చూడలేదు. దీంతో ఇదే విషయమై ఎన్టీఆర్‌కి రామ్ చరణ్ సలహా ఇచ్చారట.

    రామ్ చరణ్ సలహా.. ఎన్టీఆర్ స్పందన

    రామ్ చరణ్ సలహా.. ఎన్టీఆర్ స్పందన

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ నిర్మాణ రంగంలోకి వస్తే సూపర్ సక్సెస్ అవుతారని భావించిన రామ్ చరణ్.. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌తో చెప్పేశారట. ఈ మేరకు రామ్ చరణ్ సలహాపై ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గా స్పందించారని టాక్ వినిపిస్తోంది.

    డిసైడైన ఎన్టీఆర్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

    డిసైడైన ఎన్టీఆర్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

    రామ్ చరణ్ ఇచ్చిన సినీ నిర్మాణం ఐడియా జూనియర్‌ ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందట. దీంతో తన తోటి హీరోల వలె తానూ కూడా ప్రొడక్షన్ హౌస్ స్థాపించేందుకు సన్నాహాలు ప్రారంభించారట ఎన్టీఆర్. RRR సినిమా పూర్తికాగానే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

    తండ్రి హరికృష్ణను తలుస్తూ..

    తండ్రి హరికృష్ణను తలుస్తూ..

    తన తండ్రి హరికృష్ణ, చిన్న కొడుకు భార్గవ్ రామ్ పేర్లు కలిసొచ్చేలా దీనికి భార్గవ్ హరి ప్రొడక్షన్స్ అనే పేరుతో ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభం కానుందని అప్పుడే టాక్ మొదలైంది. మరోవైపు ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌజ్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతైనా ఎన్టీఆర్ అభిమానులకు ఇది సర్‌ప్రైజ్ న్యూసే మరి.

    2020 జులై 30న..

    2020 జులై 30న..

    ఇకపోతే ఎన్టీఆర్ తాజా సినిమా RRR రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. 2020 జులై 30న ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Rajamouli doing a prestigious project as RRR with Ntr and Ram Charan. As per latest talk Ram Charan gave Advise to Ntr in RRR sets
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X