గేమ్ చేంజర్‌లో పవన్ కల్యాణ్: తొలిసారిగా ఆ పార్టీ కోసం.. ఆ సీన్స్‌కు గూస్‌బమ్స్ ఖాయం

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు కొంత కాలంగా అతడు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తోన్నాడు.

దీనికితోడు RRR మూవీతో అతడు గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఈ మెగా హీరో ఏకధాటిగా భారీ చిత్రాల్లో నటిస్తోన్నాడు. ఇలా ఇప్పుడు చరణ్ 'గేమ్ చేంజర్' అనే భారీ బడ్జెట్ మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరే న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

Ram Charan Imitates Pawan Kalyan Style in Game Changer Movie

శంకర్‌తో భారీ బడ్జెట్ మూవీ: దిగ్గజ దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Ram Charan Imitates Pawan Kalyan Style in Game Changer Movie

స్లోగానే... అయినా చాలానే: రామ్ చరణ్ హీరోగా ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ 2021 డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత రాజమహేంద్రవరంలో, వైజాగ్‌లోనూ షెడ్యూల్‌లను పూర్తి చేశారు. మధ్యలో చాలా గ్యాప్‌లు కూడా వచ్చాయి. ఇలా ఇప్పటికే 80 శాతం వరకూ కంప్లీట్ చేశారు.

Ram Charan Imitates Pawan Kalyan Style in Game Changer Movie

కొత్త షెడ్యూల్.. వాళ్లపైనే: 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఈ వారం నుంచి మొదలుపెట్టబోతున్నారని తాజాగా ఓ న్యూస్ తెలిసింది. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్‌తో పాటు ప్రముఖ నటుడు సముద్రఖని కూడా పాల్గొంటారని సమాచారం. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో వీళ్లిద్దరి మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు వార్నింగ్ సీన్‌ను షూట్ చేస్తారని అంటున్నారు.

Ram Charan Imitates Pawan Kalyan Style in Game Changer Movie

రామ్ చరణ్ డుయల్ రోల్: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే కొన్ని లీకులు వచ్చాయి. అందులో తండ్రి పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌లోనే చూపిస్తారని, మిగిలిన భాగం మొత్తం కొడుకు పాత్రనే హైలైట్ చేస్తారని తెలిసింది. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

ఈలలు వేయడం ఖాయం: 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో కనిపించే రామ్ చరణ్ (తండ్రి పాత్ర) 'అభ్యుదయ పార్టీ' నాయకుడిగా కనిపిస్తాడు. ఆ సమయంలో అతడి నుంచి వచ్చే పొలిటికల్ డైలాగులు, స్పీచ్‌లు అదిరిపోయేలా ఉంటాయట. అంతేకాదు, ప్రభుత్వంపై అతడు పేల్చే సెటైరికల్ డైలాగ్స్ ఈలలు వేసేలా రాసుకున్నారని చెప్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై హైప్ పెరుగుతోంది.

Ram Charan Imitates Pawan Kalyan Style in Game Changer Movie

పవన్ కల్యాణ్‌లానే చరణ్: భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లోని కొన్ని సందర్భాల్లో రామ్ చరణ్.. తన బాబాయి పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేసేలా మాట్లాడుతాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. పబ్లిక్ మీటింగ్‌లలో జనసేనాని ఎంత ఫైర్‌గా స్పీచ్ ఇస్తాడో.. అచ్చం చరణ్ కూడా అదే రకంగా కనిపిస్తాడట. ఈ సీన్స్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X