రామ్ చరణ్ ఇంకో చిరు రీమిక్స్ లో ...

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ కు తొలి నాటి నుంచి తన తండ్రి సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్ అచ్చి వస్తున్నాయి. బంగారు కోడి పెట్ట, వానా వానా వెల్లువాయే, శుభలేఖ రాసుకున్నా పాటలు ఇప్పటికే రామ్ చరణ్ పై రీమిక్స్ లుగా వచ్చి విజయవంతమయ్యాయి. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రంలో కూడా రీమిక్స్ ని పెట్టనున్నారని టాక్. ఆ పాట మరేదో కాదు...'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' అని వినిపిస్తోంది.

అలాగే.. శ్రీను వైట్ల సినిమాలన్నీ తొలినుంచీ రొమాంటిక్ కామెడీలుగా సాగుతూ వస్తున్నాయి. అయితే మహేష్ తో చేసిన దూకుడు చిత్రంతో యాక్షన్ కామెడీలను మొదలెట్టారు. అయితే ఆగడు చిత్రం డిజాస్టర్ కావటంతో మరోసారి తన జానర్ మార్చాల్సిన సమయం వచ్చిందని రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. రామ్ చరణ్ తనతో యాక్షన్ కామెడీ చేయవద్దని చెప్పినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ram Charan in another remix

దాంతో శ్రీను వైట్ల చాలా కథలు నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల చెప్పిన రకరకాల స్టోరీలు, స్టోరీ పాయింట్లు విన్నాక... ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వైపు రామ్ చరణ్ మ్రెగ్గు చూపినట్లు చెప్పుకుంటున్నారు. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ని కామెడీ తో చెప్పమని రామ్ చరణ్ అన్నట్లు గా తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం తన జానర్ మార్చుకుని కథలో సస్పెన్స్ ని, థ్రిల్లింగ్ ని మెయింటైన్ చేస్తూ కథని వండుతున్నాడుట శ్రీను వైట్ల. మార్చి నుంచి ఈ చిత్రం పట్టాలు ఎక్కే అవకాసముందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందించనున్నారు. అలాగే ఈ చిత్రం జనవరి 28న ప్రారంభం కానుందని తెలుస్తోంది. అదే రోజున షూటింగ్ సైతం ప్రారంభించనున్నారు. దసరా 2015కి సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అలాగే...రామ్ చరణ్ సరసన సమంత, శ్రుతి హాసన్, రకుల్ ప్రీతి సింగ్ వీరిలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. శ్రుతి హాసన్ డేట్స్ దొరికితే ఆమే ఫస్ట్ ఛాయిస్. శ్రీను వైట్ల బ్రాండింగ్ తో తనకు ఓవర్ సీస్ లో మార్కెట్ పెరుతుందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అక్కడే మహేష్ బాబు, రామ్ చరణ్ కు మధ్య పోటీ నడుస్తోంది.

మరో ప్రక్క ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్‌ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X