మరో రీమేక్‌పై రామ్ చరణ్ కన్ను.. సూపర్ మ్యాన్‌లాంటి హీరోగా..?

ఓ భాషలో విజయం సాధించిన చిత్రాలను మరో భాషలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే అన్ని సార్లు ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం. స్థానికతను జొప్పించి, ఒరిజినల్‌లోని ఆత్మను చెడగొట్టకుండా కథలో కావాల్సిన మార్పులు చేస్తే ఎక్కడైనా మళ్లీ హిట్ కొట్టొచ్చు. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా నిరూపితమైంది.

ధృవతో సూపర్ హిట్..

ధృవతో సూపర్ హిట్..

తమిళంలో తని ఒరువన్‌గా తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగులో ధృవగా తెరకెక్కించారు. కథలోని మూలాన్ని టచ్ చేయకుండా.. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులను చేసి రీమేక్ చేశారు. రామ్ చరణ్ కూడా ఇమేజ్ అంటూ వాటి జోలికి పోకుండా.. ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. దీంతో ఈ చిత్రం అక్కడి మాదిరిగానే తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది.

మరో సినిమాపై కన్ను..

మరో సినిమాపై కన్ను..

ఇక అప్పటి నుంచి తమిళ సినిమాలో ఓ కన్నేసి ఉంచాడని టాక్. అయితే జయం రవి-అరవింద్ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన తని ఒరువన్ హిట్‌గా నిలవగా.. మళ్లీ అదే కాంబినేషన్‌లో వచ్చిన భోగన్ అనే చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రాన్ని మళ్లీ రామ్ చరణ్-అరవింద్ స్వామి కాంబోలో తెరకెక్కిస్తే బాగుండేదని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. అయితే రామ్ చరణ్‌ మాత్రం అంతంగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇన్నాళ్లకు మరో తమిళ చిత్రంపై చెర్రీ మనసు పారేసుకున్నాడని తెలుస్తోంది.

శివ కార్తికేయన్ హీరో..

శివ కార్తికేయన్ హీరో..

ఇటీవలె శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. అభిమన్యుడు చిత్రాన్ని తెరకెక్కించిన పీఎస్ మిత్రన్ ఈ హీరో చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అర్జున్-శివ కార్తికేయన్‌లను కీ రోల్‌లో చూపించిన ఈ మూవీ.. మంచి టాక్‌ను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీపై రామ్ చరణ్ మనసు పారేసుకున్నాడని టాక్.

సూపర్ మ్యాన్‌లా అవ్వాలనుకునే హీరో..

సూపర్ మ్యాన్‌లా అవ్వాలనుకునే హీరో..

చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్‌లా అవ్వాలనుకునే హీరో.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యపై ఎలా పోరాడడనేది ఈ కథ. ఈ చిత్రంలో అర్జున్, శివ కార్తికేయన్‌లు హైలెట్‌గా నిలిచారని అందరూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తాడా? లేదా డబ్బింగ్ రైట్స్ వరకు మాత్రమే ఒప్పందం జరిగిందా? అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X