twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan kalyan కోసం మూడు టీవీ ఛానెల్స్ కొన్న రాంచరణ్.. తండ్రి వైఫల్యంతో బాబాయ్ కోసం సంచలన నిర్ణయం

    |

    జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు మెగా కుటుంబం నుండి రాజ‌కీయంగా పెద్దగా మ‌ద్ద‌తు లభించలేదని అంటూ ఉంటారు. ఎందుకంటే నేరుగా జనసేనలో చేరిన నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయగా చిరంజీవి మాత్రం నేరుగా రాజకీయంగా సపోర్ట్ చేయలేదు. కానీ ఈ విషయంలో రామ్ చరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    నాగబాబు ఒక్కరే

    నాగబాబు ఒక్కరే

    నిజానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు తప్ప పెద్దగా సపోర్ట్ లభించిన దాఖలాలు లేవు, కానీ ఎన్నికల ఏడాది ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ కు మోర‌ల్ గా మ‌ద్ద‌తు ఇవ్వడానికి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా బాబాయ్ ప‌వ‌న్ ప్ర‌త్యేక‌త‌ల‌ను జ‌న‌సేన పార్టీ పేరిట ఉన్న ఒక పాట రూపంలో తీర్చిదిద్ది మరీ అప్పర్లో తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి మెగా అభిమానుల‌ను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు.

    ముందు నుంచీ సపోర్ట్

    ముందు నుంచీ సపోర్ట్

    నిజానికి రాజ‌కీయంగా ప‌వ‌న్ పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యంలోనూ..ఆ త‌రువాత ప‌వ‌న్ ఒక్క‌రే క‌నిపించారు. త‌న అన్న‌య్య‌ను కాద‌ని తాను పార్టీని పెట్టాన‌ని ప‌వ‌న్ చెప్పిన సంద‌ర్బాలు ఉన్నాయి అయితే రాం చ‌ర‌ణ్ మాత్రం ప్ర‌తీ సంద‌ర్భంలోనూ త‌న బాబాయ్ పై ప్రేమ‌ను చాటుకుంటూనే ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే రామ్ చరణ్ భార్య ఉపాసనతో మాట్లాడి బెస్ట్ అపోలో టీమ్ ను కూడా పవన్ దగ్గరకు పంపించారు.

    బాబాయ్ మీద ప్రేమ

    బాబాయ్ మీద ప్రేమ


    ఇప్పుడు మరో సరి చరణ్ తన బాబాయ్ మీద ప్రేమను చాటుకోవడానికి సిద్దమవుతున్నారు. విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ ఇప్పుడు ఏకంగా మూడు న్యూస్ చానల్స్ ని కొనే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహా న్యూస్ ఛానల్ ని కొనడానికి ప్లాన్ సిద్దం చేసిన ఆయన మరో రెండు చానల్స్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అందుకే అలా

    అందుకే అలా

    ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ప్రస్తుతం 99 టీవీ అనే ఒక్క ఛానల్ మాత్రమే పని చేస్తోంది, ప్రజారాజ్యం పార్టీతో పాటు జనసేన పార్టీకి కూడా మీడియా సపోర్ట్ లేకపోవడం వల్లే ఊహించిన ఫలితాలు రావడం లేదని భావిస్తున్న చరణ్ మొత్తం నాలుగు ఛానల్స్ జనసేన పార్టీ తరపున పని చేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ నాలుగు చానల్స్ కూడా పవన్ కళ్యాణ్ అలాగే జనసేనకు సపోర్ట్ చేస్తూ కథనాలు వెలువరించనున్నాయని అంటున్నారు.

    Recommended Video

    Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
    సపోర్ట్ లేదని

    సపోర్ట్ లేదని

    అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీకి సాక్షి ఛానల్ తో పాటు దిన పత్రిక కూడా ఉండగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 సంస్థలు పనిచేస్తున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తూ ఉంటుంది. జనసేన విషయంలో అలాంటి సపోర్ట్ దొరకకపోవడంతో ఆయన ఛానల్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. చూడాల్సి ఉంది ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది.

    English summary
    as per reports Ram Charan in talks to acquire Maha News and another couple of Channels for pawan kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X