తమిళ రీమేక్ లో రామ్ చరణ్
రామ్ చరణ్ నాలుగో చిత్రానికి అప్పుడే వేదిక రెడీ అయిపోయింది. తమిళంలో కార్తీ, తమన్నా కాంబినేషన్ లో లింగుస్వామి రూపొందించిన పయ్యా చిత్రం రీమేక్ చేయటానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఆ చిత్రం ట్రైలర్స్, పాటలు చూసిన మచ్చటపడిన రామ్ చరణ్ ఆ స్టోర్ లైన్ అడిగి తెలుసుకుని అవకాశముంటే తను ఆ సినిమా రీమేక్ లో చేస్తాను అన్నారు. వెంటనే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ వారు స్పందించి రామ్ చరణ్ నీ, లింగు స్వామినీ కలిసి కమిట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దాంతో రామ్ చరణ్ నాలుగవ చిత్రం కన్ఫర్మ్ అయినట్లు అయింది.లింగుస్వామి గతంలో రూపొందించిన రన్, పందెంకోడి చిత్రాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి.ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన జెనీలియా, కృతి కర్బందా చేస్తున్నారు. తన అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











