Ram Charan: విజయ్ 'లియో'లో రామ్ చరణ్.. లోకేష్ యూనివర్స్ లోకి ఎంట్రీ? ట్విస్ట్ మాములుగా లేదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం మూవీ ఇటీవల అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టాడు. చెర్రీ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొనియాడటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ 'విక్రమ్' మూవీ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడనే వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

 అల్లూరి సీతారామరాజుగా..

అల్లూరి సీతారామరాజుగా..

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. తర్వాత మగధీర సినిమాతో చిన్నా పెద్దా అని తేడ లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. వరసుగా పలు సినిమాలు చేస్తూ మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ.. ఇటీవల RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లూరి సీతారామరాజుగా అలరించిన రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెర్రీ..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెర్రీ..

ప్రస్తుతం రామ్ చరణ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే రామ్ చరణ్ పై హైదరాబాద్ లోని పాతబస్తీలో సాంగ్ చిత్రీకరణ జరిగింది. తాజాగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ తండ్రి పాత్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అభ్యదయం పార్టీ తరఫున చెర్రీ ప్రచారం నిర్వహించగా అతనితోపాటు శ్రీకాంత్, రాజీవ్ కనకాల ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ అయి వైరల్ గా మారాయి.

లోకీ యూనివర్స్ లో..

లోకీ యూనివర్స్ లో..

ఇక ఇదిలా ఉంటే.. గతేడాది కమల్ హాసన్ విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టారు. ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ, విక్రమ్ చిత్రాలతో లోకీ సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇందులో భాగంగానే ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు రానున్నాయన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్ హీరోగా నటిస్తున్న లియో మూవీ కూడా ఆ యూనివర్స్ కు సంబంధించినదని వార్తలు వినిపిస్తున్నాయి.

దుమ్ములేపుతున్న ప్రోమో..

దుమ్ములేపుతున్న ప్రోమో..

విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక విక్రమ్ మూవీతో లోకీ రేంజ్ నేషనల్ స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లియో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన లియో ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. అందులో లోకీ యూనివర్స్ కు సంబంధించి అనేక హింట్స్ ఉన్నట్లు నెటిజన్లు కనిపెడుతున్నారు. ఖైదీలో హీరో కార్తీ తాను ఒక బేకరీలో పనిచేసినట్లు తెలిపాడు. తాజాగా లియోలో విజయ్ కనిపించింది బేకరిలోనే. దీంతో ఇది లోకీ యూనివర్స్ అని చర్చిస్తున్నారు.

లియో మూవీలో చెర్రీ..

లియో మూవీలో చెర్రీ..

అలాగే విక్రమ్ మూవీలో చూపించిన ఎరిథ్రాక్సీలమ్ అనే డ్రగ్స్ చాక్లెట్ గింజల నుంచి తయారు చేస్తారని.. లియోలో చాక్లెట్ క్రీమ్ తయారు చేస్తూ విజయ్ కనిపించడంతో ఇదంతా లోకీ వర్స్ అని టాక్ నడుస్తోంది. ఇక ఈ లియో మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని తాజాగా వైరల్ అవుతున్న వార్త. లియో సినిమా ప్రోమోలో కనిపించిన కారు నెంబరు తెలంగాణ రాష్ట్రానికి చెందినదిగా కనిపిస్తోంది. కాబట్టి ఇందులోనే చరణ్ ఎంట్రీ ఇస్తాడు అని లాజిక్ లు వెతుకున్నారు.

గ్యాంగ్ స్టర్ గా క్యామియో..

గ్యాంగ్ స్టర్ గా క్యామియో..

రామ్ చరణ్ లియోలో నటిస్తున్నట్లు వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ, లోకేష్ తో చెర్రీ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఖైదీ 2, విక్రమ్ 2 తర్వాతా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య రామ్ చరణ్ కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు లోకేష్ సినిమాలో కూడా రామ్ చరణ్ ఒక చిన్న క్యామియో చేశారని టాక్ నడుస్తోంది. క్లైమాక్స్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్లు లియో దగ్గరకు చేరకునే క్రమంలో వాళ్లలో ఒకడిగా రామ్ చరణ్ ఉంటాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X