రాజమౌళి సినిమాతో రాంచరణ్ డీల్.. షాకిస్తున్న లెక్క!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. బాహుబలి తరువాత అంతటి పెద్ద విజయం రంగస్థలం చిత్రంతో రాంచరణ్ సొంతమైంది. ప్రస్తుతం చరణ్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. ఒకటి బోయపాటి దర్శత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ అయితే మరొకటి దేశం మొత్తం ఎదురుచుస్తున్న ఆర్ఆర్ఆర్. వినయ విధేయ రామ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా రాంచరణ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంటే ప్రస్తుతం రాంచరణ్ వందల కోట్ల బిజినెస్ జరిగే సినిమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.

నిర్మాత అతడే
వినయ విధేయ రామ, ఆర్ఆర్ఆర్ రెండు చిత్రాలకు డివివి దానయ్యే నిర్మాత. వినయ విధేయరామ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం త్వరలో జరగనుండడంతో షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. జనవరి చివర్లో తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ బిజినెస్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

రాంచరణ్ వాటా ఎంతంటే
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడనేది లేటెస్ట్ న్యూస్. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ రాంచరణ్ బిజినెస్ లెక్క మాత్రం షాక్ ఇచ్చే విధంగా ఉంది. ప్రస్తుతం రాంచరణ్ కు కున్న క్రేజ్ దృష్ట్యా సినిమాకు 18 కోట్లకుపైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దీనితో చరణ్ వినయ విధేయ రామ, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రెమ్యునరేషన్ వద్దని.. ఆ మొత్తాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇన్వెస్ట్ చేస్తానని దానయ్యతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

లాభాలు వస్తే
ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ చిత్రానికి లాభాలు వస్తే రాంచరణ్ కు భారీ మొత్తంలో ముడుతుందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చరణ్ ఖైదీ నెం 150 చిత్రంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనితో మార్కెట్ లో ఏ చిత్రాన్ని ఎలాంటి బిజినెస్ జరుగుతుందో చరణ్ సులువుగా అంచనా వేయగలుగుతున్నాడని సమాచారం.

అదరగొట్టే యాక్షన్
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీసుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నాడు. స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో సాగే సన్నివేశాలు అబ్బురపరిచే విధంగా ఉంటాయని సమాచారం. జక్కన్న రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశంలోని సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











