చిరుకి తెలియకుండా రామ్ చరణ్ పెళ్లా..?
చిరంజీవి గారి అబ్బాయి టాలీవుడ్ 'మెగాపవర్ స్టార్ రామ్ చరణ్' పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకి ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరా అని అనుకుంటున్నారా? ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూతురు. ఈ అమ్మడు రామ్ చరణ్ తేజ్ ఇద్దరు చిన్ననాటి నుండి స్నేహితులట.
చిరంజీవి గారికి తెలియకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్నయించుకున్నారట. కాని ఈ విషయం గురించి చిరంజీవి గారి ఫ్యామిలి మెంబర్స్ ని అడగగా వారు ఇదంత అంత అబద్దం అని కోట్టిపారేశారు. ఇలా రామ్ చరణ్ తేజ్ పెళ్లి వార్తల్లోకి రావడం రెండో సారి అని ముంబయి దినపత్రిక 'మిడ్ డే' ప్రచురించింది. ఇది వరకు ఇలాగే ఒక ప్రముఖ హిరోయిన్ తో ప్రేమాయణం సాగించి పెళ్లి వరకు వెళ్లారని వార్తలు వచ్చాయి. కాని ఈ సారి నిజంగానే ఈ పెళ్లి జరిగితే చిరంజీవి అభిమానులందరికి పండగే కదా మరి.


Click it and Unblock the Notifications











