వేగం పెంచిన సైరా యూనిట్.. టీజర్‌పై రామ్‌చరణ్ అసంతృప్తి..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న భారీ ప్రాజెక్టు 'సైరా నరసింహా రెడ్డి'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయబోతోంది చిత్రయూనిట్. కాగా తాజాగా సైరా నరసింహా రెడ్డి టీజర్ విషయమై ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన టీజర్ విడుదల కాగా, సినిమాపై అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేసేలా మరో టీజర్ కూడా రూపొందించింది సైరా యూనిట్. ఇప్పటికే ఈ టీజర్ ఫైనల్ కట్ జరిగిందని, అయితే నిర్మాత రామ్‌చరణ్ ఈ టీజర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. టీజర్ లో ఉంచిన కొన్ని సీన్స్ ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం ఈ టీజర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న మేకింగ్ వీడియో విడుదల చేసి ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ లోనే ఈ టీజర్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట యూనిట్ సభ్యులు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలు నడుమ ఈ సినిమా అక్టోబర్ 2 తేదీన విడుదల కానుంది. మెగాస్టార్ 151 వ సినిమాగా వస్తున్న సైరా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











