చరణ్ కాబోయే భార్య గురించి ఎంక్వయిరీ చేసిన జూ ఎన్టీఆర్..!
షూటింగ్ లకు అందమైన బ్యూటి స్పాట్ బ్యాంకాక్. టాలీవుడ్ స్టార్స్ నందమూరి, మెగా హీరోల ఇద్దరి షూటింగ్ ప్రస్తుతం అక్కడే జరుగుతోంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'ఊసరవెల్లి" చిత్రం షూటింగ్, రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న 'రచ్చ" చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది.
రామ్ చరణ్ మరియు జూ ఎన్టీఆర్ లు తెర వెనుక మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ షూటింగ్ గ్యాప్ లో కలుసుకున్నారని సమాచారం. డిన్నర్ కి కూడా వెళ్ళారట. చరణ్ కూడా కాబోయే భార్య ఉపాసనా గురించి జూ ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నాడని వినికిడి. చరణ్ కూడా ఉపాసనా గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఎన్టీఆర్ తో మాట్లాడాడని సమాచారం. మొత్తం మీద ఈ ఇద్దరూ చాలా కబుర్లు పంచుకున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి, చరణ్ బ్యాంకాక్ నుండి తిరిగి రాగానే యంగేజ్ మెంట్ ఉంటుదన్నది సమాచారం.
ram charan teja jr ntr upasana kamineni rachcha oosaravelli రామ్ చరణ్ తేజ్ జూ ఎన్టీఆర్ ఉపాసనా కామినేని రచ్చ ఊసరవెల్లి


Click it and Unblock the Notifications