చరణ్-కాజల్ మగధీర మ్యాజిక్ క్రియేట్ చేయనున్న వివి వినాయక్...!?
రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. బెస్ట్ పేయిర్ గా టాలీవుడ్ లో ముద్ర పడ్డ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ఇంతకు ముందు 'మగధీర" చిత్రంలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి వినాయక్ చిత్రంలో జతకట్టబోతున్నారట. కాగా కాజల్ అందుకు అంగీకరించలేదని ఆమె స్థానంలో సమంతను తీసుకొన్నట్టు సమాచారం. అయితే హీరోయిన్ ఎవరన్నది అధికారికంగా తెలియాల్సి వుంది.
మగధీర సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఆమె ఈ మాస్ మసాలా చిత్రంలో ఎంపిక కావటంతో చాలా సంతోషంగా ఉందంటూ ఈ మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మగధీర మ్యాజిక్ రిపీట్ కావాలంటే కత్తిలాంటి కాజల్ ని వినాయక్ సినిమాలో తప్పకుండా పెట్టుకోవాల్సిందే అంటున్నారు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని, రామ్ చరణ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలవనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనుందని టెక్నీషియన్స్ అందర్నీ త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలియచేసారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన డిస్కషన్స్, కధ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని ఈ చిత్రాన్ని కుటుంబ నేపద్యంలో సాగే యాక్షన్ సినిమాగా చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో అత్త పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పాత్రలో ఓ ప్రముఖ నటిని నటింప చేసే ప్రయత్నాలు జరిగుతున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ ఫై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2012లో ప్రారంభంలో సెట్స్ ఫై కి వెళ్ళనుందని సమాచారం.
కాగా గతంలో తమిళ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో 'మెరుపు" చిత్రంలో రామ్ చరణ్-కాజల్ అగర్వాల్ తో సినిమా షూటింగ్ కూడా ప్రారంభమై ఆ ప్రొజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆగిపోడం తెలిసిందే . మరి వినాయక్ డైరెక్షన్ లో కాజల్ అంగీకరిస్తోదో లేదో తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్‌నంది దర్శకత్వంలో 'రచ్చ"చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











