రామ్ చరణ్-కొరటాల మూవీ అంటే ‘హడల్’?
హైదరాబాద్ : ప్రభాస్‌తో 'మిర్చి' చిత్రం రూపొందించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన రచయిత కొరటాల శివ తర్వాతి చిత్రం రామ్ చరణ్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈచిత్రం ప్రారంభోత్సవం కూడా జరిగి పోయింది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రానికి దర్శకుడు 'హడల్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అభిమానులు ఆ పేరుతో పోస్టర్లు కూడా రెడీ చేసి నెట్లోకి వదిలారు. మరి 'హడల్' టైటిల్ ఖరారు చేస్తారా? లేక ఇంకేమైనా టైటిల్ ఆలోచిస్తున్నారా? అనే దానిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ ఓ హీరోయిన్ గా నటించనుంది. మిర్చి చిత్రాన్ని మాస్ ఎంటర్టెనర్‌గా రూపొందించిన కొరటాల శివ, రామ్ చరణ్‌తో చేయబోయే చిత్రాన్ని కూడా ఫుల్ మాస్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు
ఈ చిత్రంలో కథ ..పూర్తిగా బ్రదర్ సెంటిమెంట్ మీద బేస్ చేసుకుని నడుస్తుందని సమాచారం. సెంటిమెంట్,యాక్షన్ కలిసి ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరో హీరోయిన్ ఫైనల్ కానుంది.


Click it and Unblock the Notifications











