లారెన్స్ దర్శకత్వంలో రామ్ చరణ్?

By Bojja Kumar

హైదరాబాద్: ప్రభాస్‌తో 'రెబల్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ వర్గాల నుంచి. ప్రస్తుతం లారెన్స్ రామ్ చరణ్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

మెగా కుటుంబానికి మొదటి నుంచి లారెన్స్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఆ సన్నిహిత్యంతోనే ఆమధ్య తన స్టైల్ చిత్రంలో చిరంజీవితో గెస్ట్ రోల్ చేయించాడు. త్వరలోనే రామ్ చరణ్‌ను తన స్ర్కిప్టు వివరించనున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ సూచనల మేరకు అవసరం అయితే కథలో మార్పులు చేసి అతనితో సినిమా చేయాలనే దృఢ నిశ్చయంతో లారెన్స్ ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ప్రభాస్‌తో రెబల్ చిత్రాన్ని రూపొందించిన లారెన్స్ విమర్శలు మూట గట్టుకున్న విషయం తెలిసిందే. వరుస హిట్లతో విజయవంతంగా సాగుతున్న ప్రభాస్‌కు లారెన్స్ 'రెబల్' చిత్రంతో ప్లాప్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో లారెన్స్ నాగార్జునతో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసేప్పుడు లారెన్స్ కొన్ని సీన్లను అతిగా చూపెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాడనే వాదన కూడా ఉంది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ లారెన్స్ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకుంటాడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్', హిందీలో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X