twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కోసం ఆస్ట్రేలియా నుంచి ఫుట్ బాల్ కోచ్

    By Srikanya
    |

    రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం 'మెరుపు" ఫుట్ బాల్ నేపధ్యంలో రూపొందనుందనుందనే సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం రామ్ చరణ్...ఆస్ట్రేలియా నుంచి కోచ్ ని రప్పించుకుని మరీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎలా ఆడతాడు అనేది చి్త్రంలో మిస్సవకూడదు అనేది రామ్ చరణ్ ఆలోచన అని చెప్తున్నారు. రామ్‌ చరణ్‌ ఇందులో 'మెరుపు" లాంటి యువకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఆ మెరుపును ఎవరు పట్టు కోలేరు. ఒక లక్ష్యం కోసం కష్టపడి తాను అనుకున్నది సాధించే పాత్ర.

    క్రికెట్ లో మాదిరిగానే ఫుట్ బాల్ గేమ్ లోనూ జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారంట. అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ గేమ్ మన ఇండియాలో ఎందుకు ప్రాచుర్యం పొందలేకపోతున్నదనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నామంటూ రామ్ చరణ్ చెబుతున్నాడు. 'ఆరెంజ్" అనంతరం రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో ఆర్ బి చౌదరి నిర్మిస్తున్నారు. 'మెరుపు" చిత్రానికి తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహిస్తున్నాడు. ధరణి్ గతంలో పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తై నెక్ట్స్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X