చిన్ననాటి స్నేహితురాలితోనే రామ్ చరణ్ పెళ్ళి..!?
రామ్ చరణ్ తేజకు కల్యాణ ఘడియలు ముంచుకొచ్చినట్లే కనిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ కల్యాణం దాదాపు నిశ్చయమైనట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం...అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనిని ఆయన వివాహమాడబోతున్నట్లు రాసింది. ఇటీవల రామ్ చరణ్ తేజ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ అపోలో రెడ్డి కుటుంబంతో కలిసి ఈ విషయంపై మాట్లాడారట కూడా. ఆ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఇక పెళ్లి చేయాలని నిశ్చయానికి వచ్చినట్లు తెలిసింది.
అయితే రామ్ చరణ్ తేజ మాత్రం మరో రెండేళ్లు ఆగిన తర్వాత వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. కానీ చిరంజీవి మాత్రం ఇదే సరైన సమయమనీ, కుమారునికి నచ్చజెప్పినట్లు భోగట్టా. మొత్తమ్మీద అల్లు అర్జున్ తన స్నేహితురాలిని ఎలా వివాహమాడాడో అదేవిధంగా రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేస్కోబోతున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











